కొన్ని పండ్లను కొంత మంది మాత్రమే తినాలి.. ముఖ్యంగా బాలింతలు కొన్ని రకాల పండ్లను తీసుకోవడం వల్ల బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు. బాలింతలు ముఖ్యంగా తీసుకోవాల్సిన పండ్లలో సపొటాలు ఒకటి. సపోటాల్లో కెరోటిన్లు, నియాసిన్, పిండి పదార్థాలు, రైబోఫ్లేవిన్లు, శక్తి, క్యాల్షియం, థయామిన్, ఫ్రక్టోస్ వంటివి ఎక్కువగా లభిస్తాయి. మరో గొప్ప విషయం ఏమిటంటే.. ఈ పండ్లలో పాలిఫినోలిక్ అనబడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పారాసిటిక్ సుగుణాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోకి హానిచేసే సూక్ష్మక్రిములను ప్రవేశించకుండా అడ్డుపడతాయి.తాజా పండ్లలో జీవ క్రియలను మెరుగుపరచే పొటాషియం, రాగి, ఇనుము, ఫోలేట్, నియాసిన్, పాంథోయిక్ ఆమ్లాలు ఉంటాయి. ఎదిగే పిల్లలకు సపోటాలు తినిపిస్తే మంచిదంటారు. గర్భిణులు, వృద్ధులు, రక్తహీనతతో బాధపడేవారు మితంగా తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. బాలింతలు తింటే పాలు వృద్ధి చెందుతాయి.
దీనిలో ఉండే ఏ, సీ విటమిన్లు చర్మానికి కొత్త నిగారింపును తీసుకువస్తాయి. జ్యూస్ కంటే పండుగా తింటేనే మేలు ఎక్కువట.. ఇంకా చెప్పాలంటే సపొట అన్నీ విధాల మంచి పోషకాలను కలిగి ఉంటుంది.శరీరానికి తప్పనిసరిగా అవసరమైన ఐసోలూసిన్, మితియోనిన్, ఫినైల్ ఆలమిన్, థియోనిన్, ట్రిప్టోఫాన్, వాలిన్, లూసిన్ వంటి అమినో ఆమ్లాలు, విటమిన్ ఏ, రైబోఫ్లెవిన్, నియాసిన్, పాంథోనిక్ ఆమ్లం, విటమిన్ బి6, ఫోలిక్ ఆమ్లం, సైనకోబాలమిన్, విటమిన్-సి వంటి విటమిన్లు, కాల్సియం, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, సెలీనియం వంటి ఖనిజ లవణాలతోపాటుగా శక్తి, మాంసకృత్తులు, పిండి పదార్ధాలు, పీచు పదార్థం, సాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. అందుకే వయసుతో సంబంధం లేకుండా అందరూ తీసుకోవచ్చు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి