వివాహం అంటేనే సందడి ఉంటుంది. అయితే వివాహానికి బాల్య మిత్రులు వస్తే ఆ సందడి  ఇంకా అదరహో అనిపిస్తుంది. వివాహానికి ఒక్కొక్కరూ ఒక్కో రకంగా గిఫ్ట్ లు కూడా ఇస్తుంటారు. కానీ ఈ వివాహానికి వచ్చిన  స్నేహితుడు మాత్రం చాలా వెరైటీగా ఆలోచించారు. తమ స్నేహితులు వివాహానికి ఏదైనా డిఫరెంట్ గా ఉండే  గిఫ్టు ఇవ్వా లనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఎవరూ ఊహించని ఈ గిఫ్ట్ ఇచ్చి వైరల్ గా మారారు. అది ఎక్కడో చూద్దాం..?

 అయితే పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతూ సామాన్యుని నెత్తిపై  గుదిబండలా మారాయి. దేశవ్యాప్తంగా  ఆదివారం రోజున మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై  36 పైసలు, డీజిల్ పై 18 పైపుల ధర పెరిగినది. దీంతో  హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర 103.42, డీజిల్ ధర 97.45 రూపాయలకు చేరింది. ఈ పెరిగిన ధరలతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. అయితే ఏ ధరలు ఎక్కువగా ఉంటే వాటిని ఈమధ్య  గిఫ్ట్ గా ఇస్తున్నారు. అయితే ఉల్లి రేటు పెరిగినప్పుడు ఉల్లిపాయల్ని, పెట్రోల్ రేటు పెరిగినప్పుడు పెట్రోల్ ని గిఫ్ట్ గా ఇవ్వడం ఈ మధ్యే ట్రెండ్ గా మారింది.

 అయితే  జనగాం జిల్లా  నర్మెట్ట మండలంలో జరిగిన మహేష్ సుస్మితల వివాహానికి వచ్చిన తమ బాల్య మిత్రులు  లీటర్ పెట్రోల్ గిఫ్ట్ గా ఇచ్చి  పొదుపుగా వాడుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో పెళ్ళికి వచ్చినవారంతా గిఫ్ట్ ను చూసి అవాక్కయ్యారు. ఎవరైనా బట్టలు, బంగారం, లేదా ఇతర వస్తువులు గిఫ్ట్ గా ఇస్తారు. కానీ  వీరు మాత్రం పెట్రోల్ గిఫ్ట్ ఇవ్వడం  పెళ్లికి వచ్చిన బంధుమిత్రులకు  కాస్త వెరైటీగా అనిపించింది. ఇలా లీటర్ పెట్రోల్ గిఫ్ట్ గా ఇవ్వడం  సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. ఏది ఏమైనా వివాహాలలో  గిఫ్ట్ ల విషయం లో స్నేహితులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: