బంకించంద్ర చటర్జీ రచించిన సంస్కృత గీతం వందేమాతరం. అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణనినాదంగా ఈ గేయం ఉపయోగపడింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ గేయాన్ని జాతీయ గేయంగా భారత ప్రభుత్వం స్వీకరించింది. చాలా మందికి ఈ పాట పూర్తి లిరిక్స్ మీద అనేక సందేహాలు ఉంటాయి. అందుకే ఈ స్వాతంత్ర్య దోనోత్సవం నాడు మీ కోసం అందిస్తున్నాం.
''వందేమాతరం
వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం
కోటి కోటి కంఠ కలకల నివాద కరాలే
కోటి కోటి భుజై ధృత ఖర కరవాలే
అబలాకేనో మాం ఎతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం మాతరం వందేమాతరం
తుమి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వంహి ప్రాణః శరీరే
బహుతే తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి
తో మారయి ప్రతి మాగడి మందిరే మందిరే వందేమాతరం
త్వంహి దుర్గా దశప్రహరణ ధారిణీ
కమలా కమల దళ విహారిణీ
వాణి విద్యాదాయినీ, నమామి త్వాం, నమామి కమలాం
అమలాం, అతులాం, సుజలాం, సుఫలాం,మాతరం వందేమాతరం
శ్యామలాం, సరలాం, సుస్మితాం, భూషితాం
ధరణీం, భరణీం, మాతరం వందేమాతరం
వందేమాతరం''
స్వతంత్ర భారతదేశం కోసం కొత్త రాజ్యాంగం రాస్తున్నప్పుడు వందేమాతరంను జాతీయ గేయంగా స్వీకరించలేదు, దానికి జాతీయ గీతం హోదా కూడా దక్కలేదు. కానీ రాజ్యాంగబద్ధంగా సభ అధ్యక్షుడు, భారత తొలి రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ 1950, జనవరి 24న వందేమాతరం గీతానికి జాతీయ గేయం హోదా ఇస్తున్నట్లు ప్రకటించారు. బంకిం చంద్ర వందేమాతరం గీతాన్ని 1870 దశకంలో రచించారు. ఆయన ఈ గేయంలో భారతదేశాన్ని దుర్గాదేవి రూపంలో భావిస్తూ దేశప్రజలందరినీ ఆమె సంతానంగా చెప్పారు. భారతదేశాన్ని అంధకారం, బాధలు చుట్టుముట్టిన తల్లిగా ఆయన వర్ణించారు. తల్లికి నమస్కరించి, ఆమెను దోపిడీ నుంచి రక్షించమని పిల్లలైన దేశ ప్రజలను బంకిం చంద్ర కోరారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి