అమ్మాయిలు తమ అండర్ వేర్స్ లో ఒక పాకెట్ చూసే ఉంటారు.లేయర్ గా కుట్టబడి ఉన్న పాకెట్ ఉద్దేశం ఏంటో ఎప్పుడు,ఎవరు ఆలోచించి ఉండరు. కానీ ప్రస్తుతం ఈ కారణం ఏంటనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. అండర్గార్మెంట్స్ మార్కెట్ లో రిలీజ్ అయినప్పటినుండి క్రెడిట్ కార్డు సైజులో ఉండే ఈ పాకెట్ ఉన్నా కొందరు గుర్తించలేదు.ఒకవేళ కొందరు గుర్తించినా దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటో గ్రహించలేకపోయారు. వాస్తవానికి ఇది హైజెనిక్ రీజన్స్ వల్ల యాడ్ చేశారని తెలుస్తోంది. ఈ పాకెట్ తేమను పీల్చుకునే క్లాత్ తో కుట్టబడుతుండగా.. ఇది ప్రైవేటు పార్ట్స్ పొడిగా,వెంటిలేషన్ తో ఉండేలా సహాయపడుతుంది. ఎక్కువగా అబ్జర్బ్ చేసుకోవడంతోపాటు ఘర్షణను తగ్గించే విధంగా ఏర్పాటు చేయబడిన ఈ పాకెట్..ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని నివారిస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి