ఇక ఓట్స్ కి జిగురు గుణాన్ని తెచ్చిపెట్టే స్వభావం ఉండడం వల్ల ఇందులో.. కరిగే పీచు రక్తంలోని కొలెస్ట్రాల్ ను వేరు చేస్తూ దానిని తగ్గించడంలో బాగా తోడ్పడుతుంది. ఇకపోతే ఓట్స్లో విటమిన్ బి సహజంగా లభించడం వల్ల ప్రొటీన్లు , కార్బోహైడ్రేట్లు ఖనిజాల శాతం కూడా అధికంగా లభిస్తుంది. ఇక నరాల బలహీనత తో పాటు నిస్సత్తువ తగ్గించడంలో ఓట్స్ బాగా పనిచేస్తాయి. బరువు తగ్గాలనుకొనే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇందులో బెటా గ్లూకెన్ అనే పీచు పదార్థం ఉండడం వల్ల కొవ్వు ను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్లను కూడా దూరం చేయడంలో సహాయపడుతుంది అని వైద్యులు తెలియజేశారు.
ఇక మెగ్నీషియం కూడా పుష్కలంగా లభిస్తుంది. మొత్తానికి అయితే 40 గ్రాముల ఓట్స్ లో మనకు రోజుకు సరిపడా మెగ్నీషియం లభిస్తుంది. ఇక మెగ్నీషియం వల్ల బీపీ కూడా అదుపులో ఉంటుంది. ఇక రక్త నాళాలు కుచించుకు పోవడం కూడా ఇది ఆపుతుంది ఫలితంగా గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉండదు. ఇక రెగ్యులర్ గా ఓట్స్ తీసుకుంటే మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. అంతే కాదు ఇందులో ఉండే ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి