ఇంతకు ముందు రోజుల్లో అయితే మనకు తెలియని ఏదైనా విషయం కోసం పక్కనే వారిని లేదా ఎవరైనా తెలిసినవారిని అడిగే వారము. కానీ నేడు మాత్రం చిన్న నుండి ముసలి వారి వరకు ఏ విషయం కోసం అయినా ఆన్లైన్ లోనే సెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు. దానినే మారి కొందరు గూగుల్ తల్లి అంటూ ఉంటారు. గూగుల్ మాతను అడిగితే చాలు క్షణాల్లో సమాచారం మీముందు ఉంటుంది. మీకు ఏదైనా విషయం లో డౌట్ ఉందా..!! దాని గురించి సరైన సమాచారం తెలుసుకోవాలి అనుకుంటున్నారా...!! అయితే గూగుల్ ఉందిగా. మీకు గల్లీ నుండి గ్లోబల్ వరకు ఏమి జరుగుతుంది అన్న ముఖ్య వార్తలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అందుకు కూడా గూగుల్ తల్లే... ఇలా ఒకటేమిటి అన్నిటికీ అందరూ గూగుల్ లో తెగ వెతికేస్తు గూగుల్ గంట మోగిస్తున్నాయి ఉన్నారు.

అయితే తాజాగా పెళ్లయిన ఆడవాళ్ళు ఎక్కువగా గూగుల్ లో ఎటువంటి సమాచారాన్ని వెతుకుతారు అన్న ఒక అధ్యయనం జరుగగా అందులో ఆశ్చర్య పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ప్రస్తుత సమాచారం మేరకు గూగుల్ డేటా ప్రకారం.. వివాహిత మహిళలు తమ భర్తకు ఏది ఇష్టమో తెలుసుకునే విషయాలను ఎలా కనుక్కోవాలి అని వెతుకుతున్నారు. భర్తల గురించి తెలుసుకోవడానికి అడగకుండా ఎలా తెలుసుకోవాలి..అలాగే భర్తకు సంబందించిన సమాచారాన్ని , వివరాలను తెలుసుకోవడానికి సెర్చ్ చేస్తున్నారట మహిళలు.. వివాహిత మహిళలు తమ భర్తకు నచ్చినట్లుగా ఉండటం ఎలా ? అలాగే భర్తలను తమ  గుప్పెట్లో పెట్టుకోవడం ఎలా..?? అంతేకాదు బిడ్డను కనడానికి  సరైన సమయం ఏది  అని కూడా గూగుల్ నే అడిగేస్తున్నారట పెళ్లయిన మహిళలు.  తాజాగా వివాహిత మహిళలు గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్న విషయాలు ఏమిటి అన్న అధ్యయనం జరుగగా ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: