ఈ మధ్యకాలంలో చాలామంది శారీరక శ్రమ లేకపోవడం.. సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల చాలామంది ఊబకాయం సమస్య బారిన పడుతున్నారు. ఇక బరువును తగ్గించడం కోసం ఒక పూట భోజనం చేయకపోవడంతో బరువు తగ్గవచ్చనే అపోహలో ఉన్నారు. దీనివల్ల బరువు తగ్గడం అనే విషయం పక్కన పెడితే ఎన్నో అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. అందుకే నిపుణుల సలహా మేరకు అల్పాహారంలో కొంచెం ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ చేర్చుకున్నట్లైతే కచ్చితంగా మీ ఆరోగ్యం మెరుగుపడ్డమే కాకుండా అధిక బరువు కూడా దూరం చేసుకోవచ్చు. అలాగే శరీరానికి శక్తి కూడా లభిస్తుంది.


ముఖ్యంగా పెరుగు , పండ్లు,  గింజలు,  విత్తనాలతో బ్రేక్ ఫాస్ట్ అని మీరు తయారు చేసుకోవచ్చు. ముందుగా గ్రీక్ పెరుగు అరకప్పు తీసుకొని,  ఆపిల్ సగం సన్నగా తరిగినది,  అలాగే పీచ్ సగం,  దానిమ్మ గింజలు పావుకప్పు,  గుమ్మడి గింజలు ఒక చెంచా,  అవిసె గింజల పొడి ఒక చెంచా,  ఎనిమిది నానబెట్టిన బాదంపప్పు గింజలు అన్నింటిని ఒకదాని తర్వాత ఒకటి పెరుగులో వేసి బాగా కలపాలి. అయితే చాలామంది దీనిని మిక్సీలో పట్టుకొని పాలల్లో కలుపుకు తాగడానికి ఇష్టపడతారు. ఒకవేళ మీరు అలా ఆలోచిస్తున్నట్లయితే అలా చేసిన సరిపోతుంది . కానీ ఇలా నేరుగా పండ్లను తినడం వల్ల దంత సమస్యలు దూరం అవడమే కాకుండా మీ ఆరోగ్యం మెరుగు పడుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.


ఇక ఇంకొక అల్పాహారం విషయానికి వస్తే.. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అరటిపండు,  బాదం పప్పులు నాలుగు, పాలు పావు లీటరు,  దాల్చిన చెక్క పొడి పావు టీ స్పూన్ వేసి అన్ని మిక్సీ పట్టాలి . ఈ స్మూతీని గ్లాస్ లో వేసుకొని తాగడం వల్ల మీ ఆరోగ్యానికి మంచి ఆహారాన్ని అందించిన వారు అవుతారు . ఇక బరువు తగ్గడానికి ఈ స్మూతీ చాలా బాగా పనికొస్తుంది.  అలాగే గ్రీన్ ఆపిల్ , స్పినాచ్ స్మూతీ కూడా మీ బరువును తగ్గిస్తుంది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: