
ఇకపోతే ఉలవలు తీసుకోవడం వల్ల ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. ఫైబర్ తీసుకోవడం వల్ల ఎటువంటి రోగాలైనా దూరం పోతాయి. ముఖ్యంగా ఉలవలను నానబెట్టి గుగిల్లు గా ఉడకబెట్టుకొని పోపు పెట్టుకొని కూడా తినవచ్చు. ముఖ్యంగా విలువలతో తయారు చేసే రసం తినడానికి ఎంత రుచికరంగా ఉంటుందో వర్ణనాతీతం . ఇక చాలామంది కొన్ని తెగల వాళ్ళు బిర్యానీలోకి ఉలవచారును ప్రత్యేకంగా తయారు చేసుకొని మరీ తింటూ ఉంటారు. అందుకే ఉలవచారు బిరియాని అనే ఒక ఫేమస్ వంటకం కూడా భోజన ప్రియులను మరింతగా ఆహ్వానిస్తుందని చెప్పవచ్చు.
ముఖ్యంగా ఉలవలు తినడం వల్ల ఇన్నోసిటీలానే అనే ఒక కెమికల్ కాంపౌండ్ బ్రెయిన్ కి కావలసిన పూర్తి శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా మెదడుకి డామేజ్ కలగకుండా రక్షణ కల్పిస్తుంది. ఇక దీనివల్ల అల్జీమర్స్ బ్రెయిన్ స్ట్రోక్ వంటి ఇబ్బందులు రాకుండా రక్షించుకోవచ్చు. ఇక ప్రయోజనాలను కలిగి ఉన్న ఉలవలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే కానీ గర్భిణీ స్త్రీలు ఉలవలను తీసుకోకూడదు. ఎందుకంటే శరీరంలో వేడి ఎక్కువ స్రావం జరిగే ప్రమాదం ఉంటుంది.