రివర్స్ వాకింగ్ : మనం ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా వుండాలంటే వ్యాయామం చెయ్యడం చాలా ముఖ్యం. వ్యాయామం చెయ్యడం వల్ల రోజంతా చాలా ఎనర్జిటిక్ గా ఉండొచ్చు..వాకింగ్‌ అనేది ఆరోగ్యానికి చాలా మంచి వ్యాయామం.ఉదయం పూట నిద్రలేచిన తర్వాత వ్యాయామానికి ముందు కొన్ని నిమిషాలు నడవడం వల్ల శరీరానికి ఖచ్చితంగా చాలా మంచి మేలు జరుగుతుంది.ఇంకా అంతే కాకుండా రాత్రి భోజనం తర్వాత కొన్ని నిమిషాల వాకింగ్‌ వల్ల జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది. మీరు మీ రోజువారీ జీవితంలో ఆరోగ్యానికి సంబంధించిన అనేక వ్యాయామాలని చేస్తూ ఉండవచ్చు. కానీ, మీరు రివర్స్ వాకింగ్ ట్రై చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక ఈ రివర్స్ వాకింగ్‌లో అడుగులు వెనుకకు వేయడం ఉంటుంది.మీ చిన్నతనంలో మీరు సరదాగా ఇంకా ఆటలో భాగంగా ఇలా చేసే ఉంటారు.మొదట ఆటలా అనిపించే ఈ వ్యాయామం శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.


చాలా మంది కూడా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. నడిచేటప్పుడు మోకాళ్లపై ఒత్తిడి వల్ల ఈ నొప్పి ఎక్కువగా వస్తుంది. మీరు రివర్స్‌లో నడవడం వల్ల మోకాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు డాక్టర్‌తో చర్చించిన తర్వాత ఈ వ్యాయామంని చేయవచ్చు.ఈ రివర్స్ వాకింగ్ అనేది కింది వీపుపై ఒత్తిడి తెస్తుంది. దీని వల్ల వెన్ను నొప్పి ఈజీగా తగ్గుతుంది. వెన్నునొప్పితో బాధపడేవారు వైద్యుల సలహా మేరకు ఈ వ్యాయామంని చేయవచ్చు.రివర్స్ వాకింగ్ అనేది రెండు కాళ్లలోని కండరాలను బలపరుస్తుంది. ఇందులో వెనుకకు నడవడం వల్ల కండరాలు ఎక్కువగా సాగుతాయి. ఇంకా అంతే కాకుండా ఈ వ్యాయామం చేసేటప్పుడు కాళ్ల నొప్పులు కూడా తగ్గే అవకాశం ఉంది.కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఈ రివర్స్ వాకింగ్ ని ట్రై చెయ్యండి. ఖచ్చితంగా మీ ఆరోగ్యానికి చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: