సాధారణంగా పొల్యూషన్ ఆహారపు అలవాట్లు జీవనశైని కారణంగా చాలా చర్మ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తువుంది.అలాంటి వాటిలో ముఖ్యంగా మృతకణాలు చర్మంపై పేరుకుపోయి,ముఖాన్ని అందంగావిహీనంగా తయారు చేస్తుంది.దీనికోసం ఎన్నెన్నో కెమికల్స్ స్క్రబ్బర్స్ వాడిన ప్రయోజనం లేక, విసిగి చెందుతూ ఉంటారు.అంతేకాక ఆ కెమికల్ స్క్రబ్బర్స్ వలన ఇతర దుస్ప్రభావాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.అలాంటి వారికి ఇంట్లో నాచురల్ గా దొరికే వస్తువులతో తయారు చేసుకునే స్క్రబ్బర్లు చాలా బాగా ఉపయోగపడతాయని చర్మనిపుణులు సూచిస్తున్నారు.మరియు తక్కువ ఖర్చులో ఎక్కువ ఉపయోగాలు కలుగుతాయని చెబుతున్నారు.అలాంటి స్క్రబ్బర్లు ఏంటో,వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

స్క్రబ్బర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు..

దీని కోసం ఒక కప్పు ఎర్ర కందిపప్పు,ఒక కప్పు బియ్యం, ఒక కప్పు శనగపప్పు ,ఒక కప్పు పెసరపప్పు,గుప్పెడు ఎండిపోయిన గులాబీ రేకులు,గుప్పెడు ఎండబెట్టిన ఆరెంజ్ తొక్కలను తీసుకొని దుమ్ము ధూళి లేకుండా బాగా కడగాలి.ఇలా కడిగిన వీటన్నిటిని నీడలో రెండు రోజుల పాటు ఆరబెట్టి,మెత్తగా మిక్సీ పట్టి జల్లించుకోవాలి.ఇలా వచ్చిన మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో టైట్ గా మూత పెట్టి నిలువ చేసుకుంటే, నెలరోజుల పాటు వాడుకోవచ్చు.

వాడే విధానం..

పైన తయారు చేసుకున్న ఒక స్ఫూన్ స్క్రబ్బర్ పొడిని తీసుకొని,రెండు స్పూన్ల కలబంద గుజ్జు,రెండు స్పూన్ల రోజ్ వాటర్ ని వేసి బాగా కలపాలి.ఇలా వచ్చిన మిశ్రమాన్ని ముఖానికి,మెడకు అప్లై చేసి అరగంట సేపు ఆరనివ్వాలి.ఇది బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని మెల్లగా రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి. దీనితో స్క్రబ్బర్ లో ఉన్న గరుకుగా ఉన్న పార్టికల్స్, మృతకణాలను పోగొట్టడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.మరియు ఇందులో వాడిన ఆరెంజ్ తొక్కలలో కల విటమిన్ సి,ముఖంపై గల జిడ్డును పోగొట్టడానికి ఉపయోగపడుతుంది.పప్పుదినుసులలో కలిగిన ప్రోటీన్,టాన్ పోగొట్టి,చర్మాని మెరిసేలా చేస్తుంది. ఈ స్క్రబ్బర్ ను రోజు స్నానం చేయడానికి అరగంట ముందు అప్లై చేసుకొని,శుభ్రం చేసుకుంటూ ఉంటే మతకణాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: