
పాదాలు లేదా మడమలు పగుళ్లు ఎక్కువగా చర్మం పొడిగా ఉన్నప్పుడే అందులో స్థితిస్థాపక వ్యవస్థను కోల్పోతుందట. దీనివల్ల పగుళ్లకు దారితీస్తుందట.. మరి కొంతమందిలో ఎక్కువగా హై హిల్స్ ధరించే స్త్రీలలో కూడా ఇలాంటి పగుళ్లు తరచూ జరుగుతూ ఉంటాయి అట.
తరచూ తేమ లేకుండా ఉండడం వల్ల కూడా పాదాల పగుళ్లకు కారణమవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా స్నానం చేస్తున్న సమయంలో కాళ్ళను శుభ్రంగా చేసుకోవాలి.
వయసు పెరిగే కొద్దీ చర్మం లో తేమ తగ్గిపోతూ ఉంటుంది ముఖం లేదా మేడం మాత్రమే ప్రభావితం కాదు కాళ్లు మడమలు కూడా పగుళ్ళతో ఎక్కువగా విసిగిస్తాయి.
పాదాల పైన ఎక్కువగా ఒత్తిడి పెరగడం వల్ల మడమల్లో పగుళ్లు ఏర్పడతాయి అందుకే ఎక్కువసేపు నిలబడుకోకుండా ఉండడం మంచిది.
మధుమేహం థైరాయిడ్ సమస్యలు తామర వంటి చర్మ సమస్యలు ఉన్నవారికి కూడా ఇవి ఎక్కువగా వస్తాయట. సరిపోని బూట్లు ధరించడం వల్ల కూడా పాదాల పైన ఎక్కువగా ఒత్తిడి పడి మడమ , చర్మం పగుళ్లకు దారితీస్తుందట.
జాగ్రత్తలు:
పగిలిన మడమలు లేదా పాదాలు పొడి చర్మం వల్ల సంభవిస్తాయి కాబట్టి ప్రతిరోజు కూడా పాదాలకు మసాజ్ వంటి వాటిని చేసుకుంటూ నీటితో పగుళ్లను వదిలించుకోవచ్చు.
పాదాలను వారంలో రెండుసార్లైన సబ్బుతో లేకపోతే గోరువెచ్చని నీటితో కడుగుతూ ఉండాలి ఎక్కువసేపు నానబెట్టకూడదు ఇది చర్మం పైపులను దెబ్బతినేలా చేస్తుందట.
నెలలో రెండు సార్లు అయినా కొబ్బరి నూనెను చర్మానికి పూయడం వల్ల పగిలిన మడమలు కూడా తగ్గిపోతాయి. కొబ్బరి నూనెలో చర్మ కణాలు వేగంగా ఏర్పడడానికి కూడా సహాయపడుతుంది.
రాత్రి సమయాలలో పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడుక్కొని సాక్స్ ఉపయోగించడం వల్ల తేమ ఆరిపోదు.