శుక్రవారం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరి ఇల్లు కలకలాడిపోతూ ఉంటుంది . ఉదయాన్నే లేవడం .. ఇల్లు వాకిళ్ళు ఊడ్చి  ముగ్గులు పెట్టడం ..పసుపు కుంకుమతో  అలంకరించడం.. గుమ్మం ముందు పువ్వులతో అలంకరించడం.. ఉదయాన్నే ఇంటి ఇల్లాలు లేచి తల స్నానం చేసి పూజలు చేయడం .. ఆ ధూపం వేయడం అవ్వంతా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ . చాలామంది ఇళ్లల్లో శుక్రవారం ఉదయం ఇలాంటి సీన్స్ కనిపిస్తూ ఉంటాయి. అయితే అలా చేయడం చాలా చాలా మంచిది అంటూ మన ఇంట్లోనే పెద్దవారు చెప్తూ ఉంటారు . శుక్రవారం ఇంటికి మహాలక్ష్మి వస్తుంది అని అందరూ నమ్ముతూ ఉంటారు . ఉదయమే లేచి ఇల్లు వాకిల్లు  శుభ్రపరచుకొని ఇల్లంతా పరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి వచ్చి అక్కడే ఉండిపోతుంది అనేది ఎప్పటినుంచో జనాలు నమ్ముతూ వస్తున్నారు .


అయితే శుక్రవారం నాడు కొన్ని కొన్ని పనులు అస్సలు చేయకూడదు అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు . మన ఇంట్లోని పెద్దవాళ్ళు కొన్ని కొన్ని విషయాలు మనకి చెప్పిన మనం ఇప్పుడు సిటీస్ లో ఉంటున్న కారణంగా వాటిని మర్చిపోతూ ఉంటాం. ఆ అదేముందిలే ఇదేముందిలే అంటూ కొట్టి పడేస్తూ ఉంటాం . కానీ అలా చేయడం చాలా చాలా తప్పు . మరి ముఖ్యంగా శుక్రవారం ఎవరైనా సరే ఉప్పు - పప్పు - మిరపకాయలు.. నూనె అడిగితే ఇవ్వనే ఇవ్వకూడదు.  అలా ఇస్తే మన ఇంట్లోని మహాలక్ష్మి వాళ్ళకి వెళ్ళిపోతుందని నమ్ముతూ ఉంటారు జనాలు .



అంతేకాదు పల్లెటూర్లలో ఇప్పటికీ ఈ విధానాన్ని ఫాలో అవుతున్నారు . కానీ సిటీస్ లో మాత్రం అలాంటివి పెద్దగా పట్టించుకోవడం లేదు. మరీ ముఖ్యంగా గడపకు పూజించేటప్పుడు గడపకు లోపల వైపుగా ఉండి ముగ్గు వేయకూడదు . అటు వైపుగా ఉండి పసుపు కుంకుమలు  పెట్టాలి.  అది కూడా బియ్యప్పిండితో వేసిన ముగ్గు అయితే ఇంకా ఇంకా మంచిది. కానీ కొంతమంది మోడరన్ కోడళ్ళు ముగ్గులు వేయడం రాక పెయింట్ తో ముగ్గు వేసేసి దానిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు.  అలా చేసిన పూజ ఫలితం దక్కదు .



మరీ ముఖ్యంగా ఆడవాళ్లు శుక్రవారం పూట తలస్నానం చేయకుండా..ఆ నైటీ లతో..  ఒక మూల కూర్చొని  ఉండడం .. ఇంట్లో ఆశుభ్రంగా ఉండడం వంటగది శుభ్రపరచుకోకుండా ఉండడం లాంటివి చేస్తే శనిదేవత అక్కడ తాండవం  చేస్తూ ఉంటుందట . ఆ ఇంట్లో ఎప్పుడు ..చికాకులు ..భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటాయట.  ఆ కారణంగానే మన ఇంట్లోనే పెద్దవాళ్ళు ఎప్పుడు చెబుతూ ఉంటారు శుక్రవారం నాడు ఆడవాళ్లు మహాలక్ష్మిలా చీర కట్టుకొని బొట్టు పెట్టుకుని పసుపు కుంకుమలతో కలకలాడుతూ ఉంటే ఆ ఇంట్లోకి మహాలక్ష్మి వస్తుంది అని ..ఎప్పటికి ఆ ఇంట్లోనే ఉంటుంది అని బలంగా నమ్మేస్తూ ఉంటారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: