
ఏపీ రాజధాని అమరాతి ... ఈ అమరావతి వచ్చే 20 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత స్థానంలో ఉండాలని.. హైదరాబాద్ , బెంగళూరుతో పోటీ పడాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కలలు కంటున్నారు. అందుకు తగినట్టుగానే ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళుతున్నారు. ఇక ఈ అమరావతి తాడికొండ నియోజకవర్గంలో ఉంది. అమరావతి రాజధానిగా నిర్ణయించాక ఇక్కడ రియల్ ఎస్టేట్ కు ఏ స్థాయిలో బూమ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైసీపీ హయాంలో ఇదంతా నేల మీదకు పడిపోయింది. ఇప్పుడు మళ్లీ ఊపందుకుంటోంది. ఇక తాడికొండలో ఇంటి స్థలం ఉంటే అమరావతిలో సెటిల్ అయిపోయినట్టే అన్నది ఇప్పుడు రాజధానిలో బాగా పాపులర్ అయిపోయింది.
మరీ ముఖ్యంగా తాడికొండ అమరావతి రాజధాని ప్రాంతానికి సమీపంలో ఉండటం వల్ల , ఇక్కడ ప్లాట్‌లు , రెసిడెన్షియల్ ఆస్తుల పై ఎక్కువ డిమాండ్ ఉంది. కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆమోదం పొందిన లే అవుట్లకు ఎక్కువ మందికి ప్రాధాన్యం ఇస్తున్నారు. తాడికొండ పరిసర ప్రాంతాల్లో 150 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ధర సుమారు రు. 15 లక్షలు పలుకుతోంది. ప్రధాన రహదారులు, అమరావతి సమీపంలో ప్లాట్లు కూడా ఎక్కువ రేట్లు ఉంటున్నాయి. సగటున గజం పది వేల నుంచి ఇరవై వేల వరకూ ఉంటోంది. ఈ ధరలు సమీప రోజుల్లో మరింత గా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు