
వాయు కాలుష్యానికి ఎక్కువగా గురవడం. మెదడు ఎక్కువగా ఆక్సిజన్‌పై ఆధారపడుతుంది. పొల్యూషన్ వల్ల శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందకపోతే బ్రెయిన్ డ్యామేజ్ సంభవిస్తుంది. ప్రధానంగా నగరాలలో ఉండేవాళ్లకు ఇది ముప్పు. శరీరం విశ్రాంతి కోరుతున్నా దాన్ని పట్టించుకోకుండా మెదడుని పనిచేయమంటూ ఒత్తిడి పెట్టటం. దీని వల్ల మెదడు “బర్న్ అవుట్” కు గురవుతుంది. మానసిక అలసట పెరిగి, చివరికి మేధస్సు క్షీణిస్తుంది. అధికంగా చక్కెర తీసుకోవడం మెదడులో న్యూరల కనెక్షన్లను బలహీనపరుస్తుంది. దీర్ఘకాలంలో మెమరీ లాస్, అల్జీమర్స్ లాంటి సమస్యలకు దారి తీస్తుంది. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల గ్లూకోజ్ స్థాయి పడిపోతుంది.
ఇది మెదడు ఫంక్షనింగ్‌పై ప్రభావం చూపిస్తుంది. శరీరంలో నీరు తక్కువగా ఉండడం మెదడులో డీహైడ్రేషన్ కలిగించి, వత్తిడికి గురిచేస్తుంది. దీర్ఘకాలంలో మెదడు కణాలు సరిగా పనిచేయకపోవచ్చు. సిగరెట్, బీడియూ లాంటి వాటిలోని నికోటిన్ మెదడు నరాలకు హాని చేస్తుంది. మెమరీ పవర్‌ను తగ్గిస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా ఓమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ B12, ఐరన్, జింక్, మాగ్నీషియం వంటి వాటి కొరత వల్ల మెదడు బలహీనపడుతుంది. మానవ సంబంధాలు మెదడుకు స్టిమ్యులేషన్ ఇస్తాయి. ఒంటరిగా గడపడం వల్ల డిప్రెషన్, ఆత్మహత్యాప్రవణత, మెదడు శక్తి తగ్గటం జరుగుతుంది. హెడ్ఫోన్లు ఎక్కువ శబ్దంతో వినడం బ్రెయిన్‌కు నెరవడిన ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది నెమ్మదిగా మానసిక సమతుల్యతను దెబ్బతీస్తుంది.