
కొన్ని నిర్దిష్టమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. లివర్ అనేది మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. ఇది టాక్సిన్స్, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. మనం తినే ఆహారం లివర్ ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకే లివర్ ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు లివర్ ఎంజైమ్‌లను యాక్టివేట్ చేస్తాయి. ఇవి శరీరంలోని టాక్సిన్స్ ని తొలగించడంలో సహాయపడతాయి. రోజు వెల్లుల్లి తినడం వల్ల లివర్ శుభ్రంగా ఉంటుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ గ్రేప్ ఫ్రూట్ లో పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో ఉండే నరింజినిన్, నరింజిన్ అనేవి లివర్ ను రక్షిస్తాయి.
ఈ కూరగాయలలో గ్లూకోసినోలేట్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి లివర్ లోని టాక్సిన్స్ ను తొలగించడంలో సహాయపడతాయి. బ్రోకలీ, కాలీఫ్లవర్ తినడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. పాలకూర, తోటకూర వంటి ఆకు కూరలలో క్లోరోఫిల్ ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తం నుంచి టాక్సిన్స్ ను తొలగించడంలో సహాయపడతాయి. అందుకే రోజు ఆకుకూరలు తినడం అలవాటు చేసుకోవాలి.
పసుపులో ఉండే కుర్కుమిన్ అనే సమ్మేళనం లివర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ప్రతి రోజూ పసుపుని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. వాల్నట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, గ్లూటాతియోన్, అర్జినైన్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి లివర్ శుభ్రంగా ఉండేందుకు సహాయపడతాయి.
గ్రీన్ టీలో ఉండే కాటెచిన్స్ అనేవి యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. ఇవి లివర్ లోని కొవ్వును తగ్గించి, లివర్ ఫంక్షన్ మెరుగుపరచడంలో సహాయపడతాయి. కాలేయం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కూడా కాలేయం ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతుందని చెప్పవచ్చు.