అవును...ఇది నిజమే...తెలంగాణలో దశాబ్దాల పాటు రాజకీయం చేస్తున్న రెడ్యా నాయక్‌కు ఓటమి చాలా దూరంలో ఉంది. ఈయన దగ్గరకు రావడానికి ఓటమికి కూడా భయమే అన్నట్లు ఉంది. డోర్నకల్‌లో ఈయన విజయాలకు బ్రేక్ వేసే లీడర్ కనిపించడం లేదు. అసలు 1989 నుంచి డోర్నకల్‌లో ఈయన విజయాలు ఆగలేదు. వరుసపెట్టి గెలుస్తూనే వచ్చారు. 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.

అయితే 2009లో రెడ్యా నాయక్‌కు బ్రేక్ పడింది..టీడీపీ నుంచి పోటీ చేసిన సత్యవతి రాథోడ్ చేతిలో రెడ్యా తొలిసారి ఓటమి పాలయ్యారు. మళ్ళీ వెంటనే పుంజుకుని 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. కానీ కాంగ్రెస్‌లో ఉంటే అధికారంలోకి రావడం జరిగే పని కాదని అర్ధమైనట్లు ఉంది..అందుకే టీఆర్ఎస్‌లోకి జంప్ చేసి...2018 ఎన్నికల్లో మరొకసారి డోర్నకల్‌లో పోటీ చేసి గెలిచారు. దీంతో ఆరోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆరు సార్లు ఎమ్మెల్యే కావడంతో డోర్నకల్‌లో ప్రతి పల్లె గురించి ఆయనకు తెలుసు..ప్రజలు తెలుసు. ప్రజల సమస్యలని పరిష్కరించడం తెలుసు. ఇక ఇప్పుడు అధికారంలో ఉండటంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.

ఇక సీనియర్ ఎమ్మెల్యే అయినా సరే మంత్రి పదవి రాలేదనే అసంతృప్తి ఈయనకు ఉంది...పైగా జూనియర్ నేత అయిన సత్యవతికి కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వడం ఇంకా ఇబ్బంది కలిగించేలా ఉంది. అయితే రెడ్యా కుమార్తె మాలోత్ కవిత..మహబూబాబాద్ ఎంపీగా ఉన్నారు. ఒకే కుటుంబంలో రెండు పదవులు ఉండటంతో...రెడ్యాకు మంత్రి పదవి రాలేదు. అయితే రాజకీయంగా మహబూబాబాద్ పార్లమెంట్‌ పరిధిలో రెడ్యాకు తిరుగులేదు. అలాగే డోర్నకల్‌లో ఈయనకు చెక్ పెట్టే ప్రత్యర్ధులు కూడా కరువే. ఇక్కడ కాంగ్రెస్‌కు కాస్త బలం ఉంది గాని...గ్రూపు తగాదాలతో పార్టీ బిజీగా ఉంది..ఇక్కడ బీజేపీకి పట్టు లేదు..కాబట్టి నెక్స్ట్ కూడా రెడ్యాకు ఓటమి దూరమే అని చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

trs