తెలంగాణలో ఒకప్పుడు కమ్యూనిస్టులు స్ట్రాంగ్‌గా ఉండేవారనే సంగతి తెలిసిందే. కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉన్న నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. అలా కమ్యూనిస్టులు చాలా స్ట్రాంగ్‌గా ఉన్న నియోజకవర్గాల్లో నకిరేకల్ కూడా ఒకటి. ఈ నియోజకవర్గం ఏర్పాడ్డాక..సీపీఎం పార్టీ 8 సార్లు గెలవగా, సి‌పి‌ఐ పార్టీ ఒకసారి గెలిచింది. పి‌డి‌ఎఫ్ పార్టీ ఒకసారి గెలిచింది. అలాగే కాంగ్రెస్ మూడుసార్లు విజయం సాధించింది. తెలంగాణ వచ్చాక తొలిసారి నకిరేకల్‌లో టీఆర్ఎస్ గెలిచింది. 2014లో టీఆర్ఎస్ తరుపున వేముల వీరేశం విజయం సాధించారు.

ఇక 2018 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ సత్తా చాటింది...కాంగ్రెస్ తరుపున చిరుమర్తి లింగయ్య రెండోసారి విజయం సాధించారు. ఈయన కోమటిరెడ్డి బ్రదర్స్ గ్రూపులో నాయకుడు. వారి మద్ధతుతోనే గత ఎన్నికల్లో లింగయ్య సత్తా చాటారు. కానీ గెలిచాక లింగయ్య కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చి...టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌లో చేరాక...నియోజకవర్గంలో బాగానే పనులు చేసుకుంటున్నారు.

అధికార పార్టీలో ఉండటంతో నియోజకవర్గంలో సీసీరోడ్లు, బీటీరోడ్లు, రోడ్లకు మరమ్మతు, కొత్త రోడ్ల నిర్మాణాలు, సెంట్రల్‌ లైటింగ్‌ లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయిస్తున్నారు. ఇక పట్టణంలో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి...తాగునీటి సమస్యలు కూడా ఎక్కువే ఉన్నాయి. మొత్తానికి లింగయ్య....ఎమ్మెల్యేగా యావరేజ్ మార్కులు తెచ్చుకుంటున్నారని చెప్పొచ్చు.

ఇటు రాజకీయంగా చూస్తే...నకిరేకల్‌లో టీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు ఉంది. మాజీ ఎమ్మెల్యే వీరేశం...ఎమ్మెల్యే లింగయ్యల మధ్య సఖ్యత ఉన్నట్లు కనిపించడం లేదు. అటు కోమటిరెడ్డి బ్రదర్స్..లింగయ్యపై ఆగ్రహంతో ఉన్నారు. అసలు లింగయ్యకు రాజకీయం జీవితం ఇచ్చిందే..కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన వల్లే రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే నకిరేకల్‌లో కోమటిరెడ్డికి ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది.

ఇక వచ్చే ఎన్నికల్లో నకిరేకల్ అసెంబ్లీ టిక్కెట్ టీఆర్ఎస్‌లో ఎవరికి దక్కుతుందనేది క్లారిటీ లేదు. ఇటు నకిరేకల్‌లో కాంగ్రెస్‌కు కూడా సరైన నాయకుడు కనిపించడం లేదు. నెక్స్ట్ నకిరేకల్‌లో కోమటిరెడ్డి చెప్పిన వ్యక్తికి టిక్కెట్ ఇస్తారా? లేక కాంగ్రెస్ పార్టీ వేరే అభ్యర్ధిని నిలబెడుతుందా అనేది చూడాలి. కానీ లింగయ్యకు మాత్రం కోమటిరెడ్డి సపోర్ట్ ఉండదనే చెప్పాలి. ఆయనే లింగయ్యకు చెక్ పెట్టడానికి చూస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: