కొత్తగా ఉద్యోగం చేయడానికి ఇష్టపడని వారు లేదా కుటుంబ సభ్యులను వదిలి దూరంగా వెళ్లడానికి ఇబ్బంది పడే వారి కోసం ఎన్నో ఉపాధి మార్గాలు అందుబాటులో ఉన్నాయి.  ఈ క్రమంలోనే మీరు ఏదైనా వ్యాపారం చేద్దామని ఆలోచిస్తున్నట్లయితే కనీసం లక్ష రూపాయలు అయినా సరే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.  కానీ అంత మొత్తం చేతిలో లేదు.. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నట్లయితే మీలాంటి వాళ్ల కోసమే భారతీయ స్టేట్ బ్యాంక్ ఇండియా ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలోనే వ్యాపారం చేయడానికి తగిన సొమ్ము లేదని బాధపడుతున్న వారి కోసం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది ఎస్బిఐ.

సుమారుగా రూ.10 లక్షల వరకు లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.  అయితే ఈ లోన్ పొందడానికి అర్హతలేమిటి ? ఏ డాక్యుమెంట్స్ కావాలి?  అనేది ఇప్పుడు చూద్దాం. సూక్ష్మ,  చిన్న,  మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి స్వయం ఉపాధి పొందాలనుకునే వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ముద్రా స్కీం కింద లోన్లు అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే రూ. 10 లక్షల వరకు లోన్ పొందవచ్చు. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద బ్యాంకు గా గుర్తింపు తెచ్చుకున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్ర యోజన కింద వ్యాపారం చేయాలనుకునే వారికి బిజినెస్ , వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ అందిస్తోంది.

ముఖ్యంగా ఎస్బిఐ సేవింగ్స్ , కరెంట్ అకౌంట్ ఉన్నవారు ఈ ఎస్బిఐ ముద్ర లోన్స్ కి అర్హులవుతారు. మరి ఎస్బిఐ ముద్ర యోజనకు కావలసిన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే పాస్పోర్ట్ సైజు ఫోటో జత చేసి .. అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి.  అప్లికేషన్ తో పాటు కేవైసీ డాక్యుమెంట్స్ అనగా పాస్పోర్ట్ , ఆధార్ కార్డు , ఓటర్ కార్డ్,  డ్రైవింగ్ లైసెన్స్ , పాన్ కార్డు వంటి వాటిని సమర్పించాలి. అలాగే కరెంటు సేవింగ్స్,  అకౌంట్ నంబర్స్ బ్రాంచ్ వివరాలు తెలపాలి. షాపు నెలకొల్పినట్లు నిరూపించే డాక్యుమెంట్లతో పాటు బిజినెస్ రిజిస్ట్రేషన్ వివరాలు కూడా అవసరం ఉంది. ఇవన్నీ  మీరు సమర్పిస్తే 10 లక్షల రూపాయల వరకు ముద్ర పథకం కింద లోన్ పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: