ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ పలు రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొస్తూ తక్కువ పొదుపుతో ఎక్కువ లాభాలను అందించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వ పథకాలలో పోస్ట్ ఆఫీస్ పథకాలు చాలా అద్భుతంగా కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో పథకాలు అందుబాటులోకి రాగా ఇప్పుడు చెప్పబోయే అదిరిపోయే స్కీమ్ గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలి..


పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ పేరుతో అందుబాటులో ఉన్న ఈ పథకం ద్వారా వంద రూపాయల నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా ఎలాంటి లిమిట్ లేదు.. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి పోస్ట్ ఆఫీస్ ఆర్డి ఏడాదికి 5.8% వడ్డీని కూడా అందిస్తోంది. ఉదాహరణకు ఈ వడ్డీలో మార్పు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతూ ఉంటుంది. కాబట్టి ఎలాంటి రిస్క్ లేని ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో మీరు ఐదు సంవత్సరాలు మెచ్యూరిటీతో డబ్బు ఇన్వెస్ట్ చేయవచ్చు. కావాలంటే మరో ఐదు సంవత్సరాలు మీరు పొడిగించుకోవచ్చు. ఈ పథకాన్ని సింగిల్గానే కాకుండా ముగ్గురు కలిసి ఉమ్మడి ఖాతా కూడా తెరిచే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీరు ఈ పథకం ద్వారా నెలకు పదివేల రూపాయలు జమ చేస్తే ఎంత డబ్బు వస్తుంది అనేది ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

ఒక వ్యక్తి నెలకు పదివేల రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లయితే 10 సంవత్సరాల కు రూ.6,96,968 రిటర్న్ లభిస్తుంది. ఇందులో మీరు ఆరు లక్షల రూపాయలు పెట్టుబడిగా పెడితే వచ్చే వడ్డీ రూ.96,968. మరో ఐదు సంవత్సరాలు పొడిగించినట్లయితే రూ.16,26,476 గ్యారెంటీ ఫండ్ మీకు లభిస్తుంది.. అంటే మీరు రూ.12 లక్షలు పెట్టుబడి పెడితే.. రూ.4,26,476 వడ్డీ లభిస్తుంది . సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు కూడా ఉంటుంది కాబట్టి మీకు చక్కటి ఆదాయం లభిస్తుంది అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: