ఎవరైనా సరే అధిక ఆదాయం కోరుకుంటున్నట్లయితే పలు పెట్టుబడి ఆప్షన్లు చాలావరకు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒకటి అని గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఇందులో దీర్ఘకాలం డబ్బులు పెట్టుబడిగా పెడితే అదిరిపోయే రాబడిని ఇస్తాయని చెప్పవచ్చు. అందుకే మీరు కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే తప్పకుండా మీకు అంతకుమించిన అధికరాబడి లభిస్తుంది. మరి అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

ఇకపోతే కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్, యాక్సిస్ క్యాప్ ఫండ్, మిరే ఆసిట్ ఎమర్జింగ్ బ్లూచేస్ వంటి కొన్ని మ్యూచువల్ ఫండ్స్ స్థిరమైన పనితీరును కనబరుస్తున్నాయి. కాబట్టి 15% నుంచి 23% వరకు రాబడిని అందిస్తున్న నేపథ్యంలో వీటిలో ఎస్బిఐ స్మాల్ క్యాప్ ఫండ్ స్కీం ఇప్పుడు చాలా ముందంజలో ఉంది. ఇకపోతే ఐదు సంవత్సరాల కాలంలో.. దాదాపు 20% రాబడి లభించింది అలాగే ఏడు సంవత్సరాల కాలంలో 23% రిటర్న్స్ కూడా లభించడం గమనార్హం. అంతేకాదు 10 సంవత్సరాల కాలంలో చూసుకున్నట్లయితే 22% మేర ఊహించని రాబడి లభించింది.

ఉదాహరణకు ఈ మ్యూచువల్ ఫండ్ లో 10 సంవత్సరాల క్రితం రూ. లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ రూ.8 లక్షలు గా లభించేది. ఇకపోతే ఎస్బిఐ తర్వాత మిరే అసెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్ స్కీమ్ మీకు ఊహించని విధంగా రాబడినే అందిస్తోంది. ఇక ఈ పది సంవత్సరాల కాలంలో అయితే 22.2 శాతం ఈ పథకం ఆదాయాన్ని అందించింది. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ కూడా ఐదు సంవత్సరాల వ్యవధిలో 18.3 శాతం రాబడి లభించింది అలాగే 10 సంవత్సరాల కాలంలో 22.8% చొప్పున రాబడిని అందించింది. ఇక వీటిలో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే భయపడకుండా మంచి రాబడిని సొంతం చేసుకోవచ్చు అయితే ఒకసారి నిపుణుల సలహా తీసుకోవడం కూడా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: