Money.. ఎవరైనా సరే కష్టపడి డబ్బు సంపాదిస్తారు కాబట్టి ఆ డబ్బులు వృధా చేయకుండా రెట్టింపు చేసుకునే ప్రయత్నంలో వివిధ రకాల పెట్టుబడి ఎంపికలను ఎంచుకుంటూ ఉంటారు..దేశ జనాభాలో ఘననీయమైన భాగం ఇప్పటికీ కూడా పోస్ట్ ఆఫీస్, బ్యాంక్ లేదా ఎల్ఐసి పథకాలలో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఆయా సంస్థలు కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్స్ తో పెట్టుబడిదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మరికొన్నిసార్లు పాత పథకాలకు కొత్త వడ్డీరేట్లను ఆఫర్ చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.

ఇక తాజాగా పోస్ట్ ఆఫీస్ లో అందుబాటులో ఉండే కిసాన్ వికాస్ పత్ర రేటు కూడా ఇప్పుడు గణనీయంగా వడ్డీ రేట్లు పెంచేసింది . ప్రారంభ లక్ష్యం రైతులను డబ్బు ఆదా చేసేలా ప్రోత్సహించడమే ఈ పథకం యొక్క మొదటి లక్ష్యం.  భారత కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించే డిపాజిట్ పథకం కాబట్టి ఇందులో పెట్టుబడిదారుడు ఒకేసారి మొత్తాన్ని పెట్టుబడి పెట్టి నిర్ణీత వ్యవధిలో ఆ మొత్తాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఈ పథకం కింద అందించే వడ్డీ రేటును ప్రభుత్వం 2023 ఏప్రిల్ 1న 7.2 నుంచి 7.4 శాతానికి పెంచింది.

కిసాన్ వికాస్ పత్రాను  మీరు కనిష్టంగా 1000 రూపాయలను గరిష్టంగా ఎంత మొత్తాన్ని అయినా సరే ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు. ఇకపోతే కిసాన్ వికాస్ పత్రా కింద గత 120 నెలలతో పోల్చుకుంటే ప్రస్తుతం 115 నెలల్లోని డబ్బు రెట్టింపు అవుతుంది. కాబట్టి కిసాన్ వికాస్ పత్రాన్ని కనీసం 18 ఏళ్ల వయసున్న భారతీయ పౌరులు ఎవరైనా సరే సమీప పోస్ట్ ఆఫీస్ లో పథకాన్ని కొనుగోలు చేసి డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు. బ్యాంకు ఖాతాలు లేని గ్రామీణ ప్రజలు కూడా ఇందులో చేరడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉదాహరణకు మీరు ఇందులో 10 లక్షల రూపాయలను పెట్టుబడిగా పెడితే 115 నెలల తర్వాత మెచ్యూరిటీ సమయంలో మీరు ఒకేసారి రూ.20 లక్షల పొందవచ్చు.. అంటే చక్రవడ్డీ రేట్లను మీరు ప్రయోజనం కింద పొందే వీలుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: