
తాజాగా ఎల్ఐసి తన కష్టమర్ల కోసం అద్భుతమైన పథకాలను అందిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా జీవన్ లాబ్ పాలసీని కూడా తీసుకొచ్చి ఆదాయ మార్గాలను పెంచే దిశగా పనిచేస్తోంది. ఇది ఒక ఎండోమెంట్ పాలసీ కాబట్టి ఇందులో భీమా రక్షణతో పాటు పొదుపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఇకపోతే ఎల్ఐసి అందిస్తున్న ఈ పాలసీలో రోజుకు 256 రూపాయల చొప్పున నెలకు 7,960 రూపాయలు కడితే మెచ్యూరిటీ సమయానికి మీరు రూ.54 లక్షలు పొందుతారు. ఒకవేళ పాలసీ హోల్డర్ స్వర్గస్తులైనట్లయితే ఆ క్లిష్ట సమయాల్లో కుటుంబానికి ఆర్థికంగా ఈ పథకం తోడ్పడుతుంది.
18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య ఉన్న ఎవరైనా సరే ఇందులో చేరవచ్చు. ఉదాహరణకు 25 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి రూ.25 లక్షల పాలసీని ఈ పథకంలో ఎంచుకుంటే ఇందులో 16 సంవత్సరాల పాటు పాలసీదారుడు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెచ్యూరిటీ కాలం 25 సంవత్సరాలు అంటే పాలసీని ప్రారంభించిన 25 సంవత్సరాల తర్వాత నగదు మొత్తాన్ని చేతికి పొందవచ్చు. ఇకపోతే ప్రతినెల 7960 రూపాయలు చెల్లించినట్లయితే ఈ నిర్ణీత వ్యవధిలో రూ.54 లక్షలు పొందే అవకాశం ఉంటుంది ఒకవేళ మెచ్యూరిటీ సమయం ముగియకముందే పాలసీదారుడు మరణిస్తే బెనిఫిట్స్ మొత్తం నామినీకి వెళ్లిపోతాయి