సినిమా రంగం అంటేనే నటీ నటుల మధ్య రోమాన్స్.. తెర మీదనే కాదు తెర వెనక కూడా రోమాన్స్ లూ ప్రేమ కథలూ నడిపే జంటలు కోకొల్లలు గా కనిపిస్తాయి. ఈ క్రమంలో హీరోలు - హీరోయిన్ ల మధ్య ప్రేమ ట్రెండ్ పోయి ఇప్పుడు దర్శకుల ప్రేమల వలలో పడుతున్నారు హీరోయిన్ లు. వారి సంబంధాలు పెళ్ళిళ్ళ వరకూ కొందరివి వెళితే కొందరివి మధ్యలో నే ఆగిపోతున్నాయి. ఈ మధ్య జరిగిన అమలా పాల్ - దర్శకుడు విజయ్ ల పెళ్లి ఉదంతం దీనికి ఉదాహరణ. ఇలాంటి ప్రేమ వ్యవహారాలు బోలెడు చూద్దాం రండి

 

- బాలీవుడ్ దర్శకుడు, నటి వహీదా రహమాన్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అప్పట్లో అదో సంచలనం. అప్పటికే గురుదత్‌కు గీతా రాయ్ తో వివాహం జరిగింది. వహీదాతో రిలేషన్ షిప్ ఫెయిల్ కావడంతో తాగుడుకు అలవాటైన గురుదత్ 1964లో మరణించారు.

 

- బాలీవుడ్ హాట్ బ్యూటీ మహీ గిల్ తెలియనివారు ఎవ్వరు? దర్శకుడు దూలియ తో ఆమె కీ అతనికీ మధ్య చాలా జరిగింది అని ఎఫైర్ లు ఉన్నాయి అని అప్పట్లో రూమర్లు బాగా వినపడ్డాయి, పెళ్లి వరకూ వెళ్లి కూడా విడిపోయారు అని చెప్పేవారు.

 

- దర్శకుడు సాజిద్ ఖాన్ బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో ఎఫైర్ నడిపినట్లు, 2013లో వీరు విడిపోయినట్లు వార్తలు వినిపించాయి.

 

- డైరెక్టర్ మీష్ శర్మ - హీరోయిన్ పరిణీతి చోప్రా ల మధ్యన ప్రేమాయణం ఘాటుగా సాగింది. ఇద్దరూ కలిసి చాలాకాలం రెస్టారెంట్ లూ - సినిమాలూ చెట్టపట్టాలు వేసుకుని బాగా తిరిగారు.

 

- దేవ్ డీ సినిమాలో ప్రత్యేక పాత్ర చేసిన కల్కీ కొచ్చిన్ ని ఆ సినిమా దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రాణం గా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఇద్దరూ కలిసి ఎన్నో ఆసక్తికర సినిమాల్లో పాలు పంచుకున్నారు కూడా .

 

- జాతీయ అవార్డు పొందిన డైరెక్టర్ ఆదిత్య చోప్రా బ్యానర్ లో ఆస్థాన హీరోయిన్ గా ఉండే రాణీ ముకర్జీ ఇప్పుడు ఆయన ఆస్థాన భార్య కూడా అయ్యింది. చాలా కాలం పాటు వీరిద్దరూ పీకల లోతు ప్రేమలో గడిపారు.

 

- బాలీవుడ్ మేటి దర్సకుడు ఇంతియాజ్ అలీ పాకిస్తాన్ కి చెందిన మోడల్ ఇమాన్ అలీ తో అఫైర్ పెట్టుకున్నాడు. ఐదేళ్ళ క్రితమే పెళ్ళయిన ఇంతియాజ్ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు అని వార్తలు వచ్చేవి. ఈ వార్తల వల్ల అతని భార్యతో దాదాపు విడిపోయినంత పని చేసాడు.

 

- రామ్ గోపాల్ వర్మ తనతో కలిసి పలు చిత్రాల్లో పని చేసిన ఉర్మిలా, నిషా కొటారి, ఆంత్రమాలిని, మధుశాలిని లాంటి వారితో ప్రేమాయణం నడిపారనే పుకార్లు ఆ మధ్య వినిపించాయి. ఇప్పటికీ వర్మ మీద అలాంటి పుకార్లు వస్తూనే ఉంటాయి వాటిని ఆయన ఇష్టపడతాడు కూడా

 

- హీరోయిన్ ఆమీశా పటేల్ - సుస్మితా సేన్ లతో బాలీవుడ్ దర్శకుడు , నిర్మాత విక్రం భట్ ఒకే సారి ప్రేమాయణం నడిపారు అని అప్పట్లో మీడియా కోడై కూసింది. వారిద్దరికీ ఒకరికి తెలీయకుండా ఒకరితో ఆయన డేటింగ్ చేసేవారు అని ఆ తరవాత విషయం తెలుసుకున్న ఇద్దరు యువతులూ అతనితో చాలా గొడవలు పది విడిపోయారు అని భోగట్టా !


మరింత సమాచారం తెలుసుకోండి: