బాలీవుడ్ లో ఓ సినిమాలో నటించిన హీరో హీరోయిన్ల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా అదిరిపోయేలా ఉంటుంది. సినిమాలో వారు పోశించిన లవర్ పాత్రలను ఆఫ్ స్క్రీన్ కూడా జీవించేస్తూ ఉంటారు. మళ్లీ మరో సినిమా ఛాన్స్ వచ్చేదాకా ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే కొన్ని ప్రేమలు వేరే ఎన్ని సినిమాలు చేసినా అలా కంటిన్యూ అవుతూ వస్తాయి లేండి.


ఏది ఏమైనా నెలకో ప్రేమాయణం కొనసాగించే బాలీవుడ్లో ఎప్పుడు ఏదో ఒక జంట హాట్ న్యూస్ గా నిలుస్తుంది. ఎన్నో ఊహించని జంటలు కలుస్తూ ఉంటే మరెన్నో క్రేజీ జంటలు తమ వివాహ బందాన్ని కూడా రద్దు చేసుకుంటున్నాయి. అయితే ఇది తమకు పట్టదు అనట్టు ఓ బాలీవుడ్ నిర్మాత తనయుడు ఓ హీరో కూతురు కలిసి డేటింగ్ చేస్తున్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.  


బోణికపూర్ తనయుడు అర్జున్ కపూర్, సునీల్ శెట్టి తనయ అతియా శెట్టి ఇద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని తెలుస్తుంది. అంతేకాదు వారిద్దరు కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్నట్టు సమాచారం. హీరోగా తెరంగేట్రం చేసినా హిట్ కోసం మొహమాసి ఉన్న అర్జున్ కపూర్ ప్రస్తుతం చేస్తున్న 'కి అండ్ కా' మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇక 'హీరో' సినిమాతో తెరంగేట్రం చేసిన అతియా ఆ సినిమాతో అలరించినా కమర్షియల్ గా సక్సెస్ అవాలేదు. 


సో ఎలా కుదిరిందో ఎప్పుడు కుదిరిందో తెలియదు కాని వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ బౌండ్ అయ్యిందట. ప్రస్తుతం పెళ్లిల్లు చేసుకున్న బంధాలే నిలబడలేకున్న బాలీవుడ్ జంటల్లో ఈ జంట కొనసాగిస్తున్న ప్రేమ జోరు ఎన్నాళు కొనసాగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: