నాని అసమర్థత వల్ల ‘బిగ్‌ బాస్ 2’ రేటింగ్స్ పడిపోతున్నాయి అని వస్తున్న విమర్శలకు సమాధానంగా నిన్నరాత్రి ప్రసారం అయిన ‘బిగ్ బాస్ 2’ షోలో నాని తన విశ్వరూపాన్ని చూపించి హోస్ మేట్స్ పై ఘాటైన విమర్శలు చేస్తూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నాలు చేసాడు. నిన్నటి షో అంతా నాని తన హౌస్ మేట్స్ కు క్లాస్ పీకటంలోనే గడిచిపోయింది. 
భానుశ్రీకి దిమ్మతిరిగేలా
టాస్కుల్లో తప్పులు దొర్లాయని భానుశ్రీ, తేజస్వినికి నాని గట్టిగా క్లాస్ పీకడమే కాకుండా భానుశ్రీ ఇప్పటికే చేసిన తప్పుకు సారీ చెప్పినప్పటికీ మళ్లీ ఆ ఎపిసోడ్‌ను తెరపైకి తెచ్చి నాని మళ్లీ దానిపై చర్చ చేపట్టడం కొద్దిగా అతిగా అనిపించింది. అంతేకాదు ఇక ఇంటి సభ్యుల మధ్య పుల్లలు పెట్టేందుకు నాని ఇలాంటి చర్చ మొదలుపెట్టాడా అన్న ప్రశ్నలతో పాటు రేటింగ్స్ పడిపోతున్న ‘బిగ్ బాస్ 2’ షోను రక్షించడానికి ఇలాంటి సులువైన మార్గాన్ని నాని ఎంచుకున్నాడా అంటూ సందేహాలు కూడ మొదలయ్యాయి. 
బర్త్ డే సెలబ్రేషన్స్
ముఖ్యంగా మంచి చెడుల టాస్క్ లో  నిందితురాలిగా మారిన భానుశ్రీని నాని ఉతికి పారేసి తన ఆదిపత్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నించాడు. రోల్ రైడా కోసం త్యాగం చేయడాన్ని ఎత్తి చూపుతూ గణేష్‌ కు గట్టి క్లాస్ పీకాడు నాని. అంతేకాదు ఇలాంటి షోలకు త్యాగాలు చేయడానికి మంచివాళ్ళుగా మారడానికి ఎవ్వరూ రానక్కరలేదని చెపుతూ హౌస్ మేట్స్ తమ మధ్య మరింత చిచ్చు రేపుకోమని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు నాని. 
డీసెంట్ లుక్‌తో అదుర్స్
అయితే అందర్నీ తన మాటలతో దాడిచేసిన నాని బాబు గోగినేని గీతా మాధురిల విషయంలో మటుకు సంయమనం పాటిస్తున్న నేపధ్యంలో వీరిద్దరూ చివరి రౌండ్ వరకు ఉంటారా ? అన్న అనుమానాలు కలగడం సహజం.  ఇది చాలదు అన్నట్లుగా నిన్నటి షోలో డిఫరెంట్ లుక్ తో బాబు గోగినేనిని చూపెట్టి ఈ షోపై ఆసక్తి పెంచడానికి నిర్వాహకులు ప్రయత్నాలు చేసారు. ముఖ్యంగా తనీష్‌ ను టార్గెట్ చేస్తూ నాని నీవల్లనే దీప్తి సునైన ఏమీ నేర్చుకోలేకపోతోంది అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు. అయితే ఈ వారాంతపు షోను చూసిన వారు అంతా నాని క్లాస్ పీకడం తప్ప ప్రేక్షకులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు అంటూ కామెంట్స్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈరోజు ప్రసారం కాబోతున్న ఎలిమినేషన్ షోలో ఏమైనా అనుకోని సంచలనాలు లేకుంటే ఈ షోను రక్షించడం ఎవరితరం కాదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: