
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ‘చంద్రముఖి’చిత్రంలో గంగ పాత్రలో నటించి మెప్పించిన జ్యోతిక హీరో సూర్యను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లైన తర్వాత జ్యోతిక ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. నటి జ్యోతిక పోలీస్ అధికారిగా, జీవీ ప్రకాష్ కుమార్ మరో ముఖ్య పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘నాచియార్’. సెన్సేషనల్ దర్శకుడు బాల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ క్రైమ్ డ్రామా తమిళనాట ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువాదమై ‘ఝాన్సీ’ పేరుతో వస్తోంది.
కల్పనా చిత్ర, యశ్వంత్ మూవీస్ బ్యానర్లపై కోనేరు కల్పన, డి.అభిరాం అజయ్ కుమార్ సంయుక్తంగా ‘ఝాన్సీ’ని విడుదల చేస్తున్నారు. ‘ఝాన్సీ’చిత్ర టీజర్‌ను ‘సమ్మోహనం’ చిత్రంతో మంచి విజయం సాధించిన యువ హీరో సుధీర్ బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ.. టీజర్ చాల బాగుంది. జ్యోతికను పోలీస్ ఆఫీసర్‌గా చూస్తుంటే ఆమె భర్త సూర్య గుర్తుకొస్తున్నారు.
గతంలో సూర్య నటించిన సింగం, సింగం 2 చిత్రాల్లో ల్లో ఎంత పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడో..ఇప్పుడు జ్యోతిక కూడా అంతే స్పీడ్..పవర్ ఫుల్ తో నటించారు. ఈ చిత్రం తెలుగు లో తప్పకుండా హిట్ అవుతుందని నాకు ఎంతో నమ్మకముందని అన్నారు సుదీర్ బాబు. తెలుగులో ఝాన్సీ అనే పవర్ ఫుల్ టైటిల్ తో మన ముందుకు వస్తుంది.
టీజర్ చూశాక సినిమా ఖచ్చితంగా చూడాలేని ఫీలింగ్ కలుగుతున్నది. తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాతలు కోనేరు కల్పన, డీ అభిరాం అజయ్ కుమార్‌కు ఆల్ ది బెస్ట్ అని అన్నారు. జ్యోతిక టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్, జీవీ ప్రకాష్ అద్భుత నటన, ఇళయరాజా సంగీతం ఈ చిత్రం సక్సెస్‌రే ప్రధాన కారణమైంది.
మరింత సమాచారం తెలుసుకోండి:
jhansi movie
bala
naachiyaar manastars
sudeer babu
ap political updates
telangana politics
telugu political news
latest news
latest ap updates
political news
indian politics
international news
national news
tollywood news
bollywood news
kollywood news
hollywood news
tollywood
latest film news
latest updates