ఈ కాలం కుర్రకారు కి స్వతంత్ర దినోత్సవం గురించి , స్వాతంత్ర్యం యొక్క గొప్పతనం గురించీ తెలిసింది చాలా చాలా తక్కువ అనే చెప్పాలి .. పుస్తకాల్లో దీని గురించి ఎంతగా పాఠాలు గా చెప్పినా వాళ్ళ బుర్రలకి ఎక్కింది మాత్రం తక్కువ అనే అనుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేటు స్కూళ్ళ లో పాఠాలు కేవలం సిలబస్ పూర్తి చెయ్యడం మీద, పరీక్షల్లో మార్కుల మీదా మాత్రమే దృష్టి పెట్టి నడుస్తాయి కాబట్టి. ఈ క్రమం లో మీ పిల్లలతో ఈ పర్వదినాన దేశం కోసం కష్టపడిన , దేశం గురించి అద్దం పట్టే కొన్ని సినిమాలు చూపించే ప్రయత్నం చెయ్యండి .. వాటిల్లో ముఖ్యంగా ఈ నాలుగూ చూపించండి.

Image result for independence day

1. అల్లూరి సీతారామ రాజు : 
తెలుగువాడు ఐన అల్లూరి సీతారామ రాజు మన్యం యోధుడు గా ప్రపంచం ఎరిగిన వ్యక్తి. బ్రిటీష్ పరిపాలన లో సాగుతున్న అరాచకాలు ప్రశ్నించి, ఎదిరించి , దేశం కోసం - మన్యం కోసం తనువు చాలించిన గొప్ప వీర యోధుడు. గుండెల్లో తూటాలు దిగుతున్నా గొంతులో వందేమాతరం అన్న మాట మాత్రం ఆపలేదు. అంతటి మహా వీరుడి కథను కళ్ళకు కట్టినట్టు చూపించే చిత్రం అల్లూరి సీతారామరాజు. సూపర్ స్టార్ కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు పాత్రకు జీవం పోశారు తద్వారా చరిత్రలో నిలిచిపోయే సినిమాని ప్రేక్షకులకు అందించారు.
Image result for alluri sitarama raju

2.భారతీయుడు : 
బ్రిటిషు వారు స్వతంత్రం ప్రకటించిన తరువాత కూడా మన భారత దేశాన్ని పీక్కు తింటుంటున్న లంచగుండెలను హతమార్చే ఒక భారతీయుని కథ. అతనికి దేశమా, కొడుకా అని అడిగితే దేశానికీ ద్రోహం చేస్తున్న కన్న కొడుకునే చంపిన ఒక భారతీయుడి కథ. మీ పిల్లలకు నిజాయితీ విలువ తెలియాలంటే భారతీయుడు సినిమా తప్పకుండా చూపించండి.

Related image

3. ఖడ్గం
మతం అన్నది మాటే కానీ అన్ని మతాలను సమానంగా చూసే భరతమాత గొప్పదనం వివరించిన అద్భుతమైన చిత్రం ఖడ్గం. అందరు కలిసి మెలసి ఉండాలని చెప్పే గొప్ప చిత్రం ఖడ్గం. కుల మత పిచ్చిని ఖడ్గంతో ప్రక్షాళన చేయమని బోధించే మంచి సందేశాత్మక చిత్రం ఖడ్గం.

Related image

4. బొబ్బిలి పులి
జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ అనే పాట ని చాలా ముఖ్యంగా మీ పిల్లలకి వినిపించారు .. ఏ తల్లి నిను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా, నీ తల్లి మోసేది నవ మాసాలేరా కానీ ఈ తల్లి (భూమి) మోయాలి కడవరకు రా కట్టే కాలే వరకు రా, ఇంతటి గొప్ప మాటలు ఉన్న బొబ్బిలి పులి సినిమాను మీ పిల్లలకు తప్పకుండ చూపించండి.

Image result for బొబ్బిలి పులి

మరింత సమాచారం తెలుసుకోండి: