భారతదేశం దిగ్గజ దర్శకుడు రాజమౌళి చాలా సంతోషంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో తన ఆనందానికి గల కారణాన్ని జనాలతో పంచుకున్నారు. ఇంతకి విషయం ఏమిటంటే రాజమౌళి తనయుడు కార్తికేయ గతంలో బాహుబలి సినిమా కి పొడక్షన్ మేనేజర్గా పనిచేసిన విషయం మనకందరికీ తెలిసినదే.

Image result for rajamouli smiles

అయితే ఆ తర్వాత యుద్ధం శరణం కు లైన్ ప్రొడ్యూసర్ గా పనిచేసి తాజాగా కార్తికేయ పూర్తిస్థాయి నిర్మాతగా మారిపోయాడు..ఈ క్రమంలో  తన తండ్రి రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి మంచి కష్టపడే వ్యక్తిగా పేరు తెచ్చుకున్న విషయం గంగరాజు అనే అతన్ని చిత్ర దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆకాశవాణి అనే సినిమాని నిర్మిస్తున్నాడు..ఇదే క్రమంలో సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు కాల భైరవ ఈ చిత్రం ద్వారా మ్యూజిక్ డైరక్టర్‌గా పరిచయం చేస్తున్నాడు.

Image result for రాజమౌళి

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రాజమౌళి.. ‘‘ఇలాంటి సమయంలో నా కంటే సంతోషంగా ఎవరుంటారు. ఆకాశవాణి చిత్రానికి నిర్మాత, సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న కార్తికేయ, కాల భైరవలను చూస్తుంటే ఆనందంగా ఉంది. నా మాజీ అసిస్టెంట్ అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. టీం మొత్తానికి గుడ్ లక్’’ అంటూ పోస్ట్ చేశాడు. ఈ సందర్బంగా ఆకాశవాణి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాడు రాజమౌళి.


మరింత సమాచారం తెలుసుకోండి: