ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ముద్దుగుమ్మలు ఆ తర్వాత హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వారు ఉన్నారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన స్థాయికి చేరుకున్న తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో చాలా తక్కువ శాతం మంది మాత్రమే సక్సెస్ అయ్యారు. కానీ టాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చిన ముద్దుగుమ్మలు చాలా శాతం వరకు హిందీ సినిమాలలో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.

అదే హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చినట్లయితే చాలా మంది ఆ అవకాశాన్ని వదులుకోకుండా సినిమాల్లో నటిస్తూ ఉంటారు. ఇకపోతే ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన నటి మనులలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న ఓ ముద్దుగుమ్మకు బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చినట్టు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా తక్కువ కాలంలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటి మనులలో మీనాక్షి చౌదరి ఒకరు. ఇప్పటికే ఈమె ఎన్నో తెలుగు సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ నవీన్ పోలిశెట్టి హీరో గా రూపొందుతున్న అనగనగా ఒక రాజు అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మీనాక్షి చౌదరి కి బాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి అక్షయ్ కుమార్ సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీ అక్షయ్ కుమార్ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల కానున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mc