షారూఖ్ ఖాన్ సినిమా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్ . 2018 లో సినిమా రిలీజ్ చేసిన షారూఖ్...ఈ గ్యాప్ లో వాళ్లతో సినిమా చేస్తున్నాడు, వీళ్లతో సినిమా చేస్తున్నాడు అని రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ వాటన్నింటికీ చెక్ పెడుతూ తన నెక్ట్స్ సినిమా డైరెక్టర్ గురించి చిన్న హింట్ ఇచ్చాడు ఈ బాలీవుడ్ కింగ్.

 

షారూఖ్ ఖాన్ 2018  డిసెంబర్ లో వచ్చిన జీరో సినిమా తరవాత ఇప్పటి వరకూ ఒక్క  సినిమా కూడా రిలీజ్ చెయ్యలేదు. రిలీజ్ చెయ్యడం తర్వాత సంగతి అసలు సినిమా ఓకే కూడా చెయ్యలేదు. కథలు వింటున్నానని, యాక్షన్ సినిమా చేస్తానని,  మీ దగ్గర ఏవైనా కథలుంటే పంపించమని రకరకాలుగా ఫ్యాన్స్ కు సమాధానం చెబుతున్నాడు షారూఖ్ ఖాన్.

 

దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి సినిమాలు చెయ్యకుండా గ్యాప్ తీసుకున్న షారూఖ్ ఇప్పుడు సినిమాల గురించి ఆలోచిస్తున్నాడు. లేటెస్ట్ గా లాక్ డౌన్ పీరియడ్ లో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయిన షారూఖ్ ..తన నెక్ట్స్ సినిమాడైరెక్టర్ తో చేస్తున్నాడో చిన్న క్లూ ఇచ్చాడు . మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరని ఇద్దరు హాలీవుడ్ డైరెక్టర్ల పేర్లు చెబితే.. వాళ్లకన్నా రాజు హిరానీ అంటే ఇష్టం. ఎందుకంటే రాజు ని చూస్తే ..మనవాడని అనిపిస్తుందని రిప్లై ఇచ్చాడు షారూఖ్.

 

రాజ్ కుమార్ హిరానీ .. 3 ఇడియట్స్, పి.కె, సంజు లాంటి సూపర హిట్ సినిమాలు చేసి సక్సెస్ కొట్టిన డైరెక్టర్ . జస్ట్ 5 సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ అనిపించుకున్నాడు . రాజు డైరెక్షన్లో ఇప్పటివరకూ షారూఖ్ ఖాన్ సినిమా చెయ్యలేదు . వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందని ఎప్పటినుంచో ఇండస్ట్రీలో చర్చ కూడా జరుగుతోంది. ఇలాంటి టైమ్ లో సక్సెస్ కోసం రాజు హిరానీ తో సినిమా చెయ్యాలని, చేస్తాడని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. ఈ టైమ్ లో షారూఖ్ కూడా రాజు  గురించి ఇలాంటి కామెంట్స్ చెయ్యడంతో ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో షారూఖ్ నెకట్స్ సినిమా కన్ఫామ్ అనుకుంటున్నారు బాలీవుడ్ జనాలు . మరి షారూఖ్ ఖాన్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడిస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: