టాలీవుడ్ క్రేజీ మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు అంటే కచ్చితంగా ఆ సినిమా మ్యూజిక్ పరంగా తిరుగు లేదు అన్నట్టే. రాజమౌళి సినిమాకు కీరవాణి మ్యూజిక్ యాడ్ అయితే ఆ లెక్క వేరేలా ఉంటుంది. అయితే లేటెస్ట్ గా కీరవాణిసినిమా నుండి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో వస్తున్న సినిమా చెక్. ఈ సినిమాకు మొదట కీరవాణితో మ్యూజిక్ చేయించాలని అనుకున్నారు.

కాని కరోనా లాక్ డౌన్ వల్ల బడ్జెట్ కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో కీరవాణిని సినిమా నుండి తప్పించినట్టు తెలుస్తుంది. కీరవాణి మ్యూజిక్ అందించాలంటే భారీ రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన అడిగినంత ఇవ్వడం కష్టం కనుక కీరవాణి బదులుగా శ్రీకర్ అగస్తిని మ్యూజిక్ డైరక్టర్ గా ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తుంది. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో సూపర్ హిట్ మ్యూజిక్ అందించిన శ్రీకర్ అగస్తి మంచి అవకాశాలు అందుకుంటున్నాడు.

చంద్రశేఖర్ యేలేటి మనమంతా తర్వాత చేస్తున్న సినిమా చెక్. ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్ గా నటిస్తున్న్నారు. నితిన్ రంగ్ దే సినిమా తర్వాత ఈ సినిమా రిలీజ్ అవనుంది. రంగ్ దే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతుండగా.. చెక్ మాత్రం కమర్షియల్ మూవీగా వస్తుంది.                                                                                      

మరింత సమాచారం తెలుసుకోండి: