సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. దేశంలోని అనేకమంది సినీ సెలబ్రిటీలు రాజకీయాల్లోకి వచ్చారు. దక్షిణాది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి ఎక్కువగా వెళ్లారు.. ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. ప్రస్తుతం తమిళ్ నుంచి కమల్ హాసన్ పార్టీ పెట్టి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. రజినీకాంత్ కూడా రాజకీయ ప్రవేశంపై ఆమధ్య ప్రకటన చేశారు. అయితే.. ఇటివల ఆయన పొలిటికల్ ఎంట్రీపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆయన ఆరోగ్యం సహకరించడం లేదనీ.. అందుకే పొలిటికల్ ఎంట్రీ క్యాన్సిల్ అయిందంటూ వార్తలు వచ్చాయి. వీటిని ఖండిస్తూ రజినీ మరో ప్రకటన కూడా చేశారు.

అయితే.. ఇదంతా రజినీ పొలిటికల్ ఎంట్రీపై వెనుకనుంచి జరుగుతున్న ఓ తతంగంగా వార్తలు వస్తున్నాయి. రజినీకి సినిమాల్లో భారీ ఇమేజ్ ఉందన్న విషయం తెలిసిందే. అది డ్యామేజ్ కాకుండా ప్రజాభిప్రాయం తీసుకునేందుకు ఆయన కాంపౌండ్ నుంచే ఈ ఫేక్ లెటర్ వచ్చుంటుందని అంటున్నారు. ఫ్యాన్స్ మద్దతు కూడగట్టుకుని.. ప్రజల్లో పొలిటికల్ ఇమేజ్ పెంచుకుని రాజకీయాల్లోకి వచ్చే ప్లాన్ ఇది అనే వ్యాఖ్యలకూ కొదవ లేదు. అందుకే.. ఓ ఫేక్ లెటర్.. అందులో రజినీ ఆరోగ్య వివరాలతో పొలిటికల్ ఎంట్రీపై క్రేజ్ తీసుకొచ్చారని తమిళ సినీ, రాజకీయ వర్గాల నుంచి కామెంట్స్ వస్తున్నాయి.


రెండు దశాబ్దాల క్రితం 1999లో వచ్చిన నరసింహలోనే రజినీ పొలిటికల్ ఎంట్రీపై డైలాగులు ఉన్నాయి. అప్పటి నుంచీ ఇప్పటికీ రజినీ రాజకీయంపై వార్తలు నడుస్తూనే ఉన్నాయి.. ఆయన దాటవేస్తూనే ఉన్నారు. ఇప్పుడు జయలలిత, కరుణానిధి లేకపోవడంతో ఆయన పార్టీ పెడతానంటూ ముందుకొచ్చారు.. ఫ్యాన్స్ తో మీటింగ్ కూడా పెట్టారు. ఇది జరిగి ఏడాది పైగానే అయినా.. మళ్లీ కామ్ అయిపోయారు. దీంతో రజినీ తన పొలిటికల్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే వ్యాఖ్యలు ఎక్కువగానే వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: