సాధారణంగా ఒక సినిమాకు బడ్జెట్ పెడితే,కొంతలో కొంత బడ్జెట్ అమౌంట్ ని సంపాదించి పెట్టాలి. అప్పుడే నిర్మాతకు కొద్దిగా ఊరట నిస్తుంది. ఒకవేళ పెట్టిన పెట్టుబడి కూడా అందక,మొత్తం ఊడ్చుకుపోతే ఇక ఆ నిర్మాత షెడ్ కి వెళ్లాల్సిందే. సరిగ్గా ఆసినిమాలో  కూడా అలాగే జరిగింది.  ఆ సినిమా ఏంటి?ఆ నిర్మాత  ఎవరు? దాని విశేషాలు ఏంటో? ఇప్పుడు చూద్దాం.


మెగాస్టార్ చిరంజీవి,దేవి ప్రసాద్ కాంబినేషన్ అంటే అప్పట్లో చాలా క్రేజ్ ఉండేది. వారిద్దరి కాంబినేషన్ చాలా హిట్లను సంపాదించిపెట్టింది.  వీరి కాంబినేషన్ లో అల్లుడా మజాకా,మంచి దొంగ,ఘరానా మొగుడు వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి. వీటితోపాటు వీరిద్దరి కాంబినేషన్ లోని మృగరాజు అనే చిత్రం కూడా వచ్చింది. ఇక దర్శకుడు గుణశేఖర్,చిరంజీవి లు కలిసి అప్పటికే "చూడాలని ఉంది" అనే సూపర్ హిట్ చిత్రాన్ని చేశారు. ఇక అప్పటికే చిరంజీవి, దేవి ప్రసాద్ లక్కీ సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డు ఉండేది. ఇక అదే ట్రాక్ను నడిపించాలనే ఉద్దేశ్యంతోనే నిర్మాత దేవిప్రసాద్ గుడ్డిగా మృగరాజు సినిమా కి ఆ రోజుల్లోనే 15 కోట్ల భారీ బడ్జెట్ ను పెట్టేసాడు.

ఇక ఈ చిత్రంలో నటించిన జాక్ అనే సింహానికి నిర్మాత ఏకంగా 67 లక్షలు ఖర్చు చేశాడట. ఇక చిరు ఇంట్రడక్షన్ సాంగ్ కి అరవై లక్షలు ఖర్చు చేశాడు. మొదట సోనాలి బింద్రే ను ఈ సినిమాకు హీరోయిన్ గా అనుకున్నారు కానీ కొన్ని కారణాల చేత ఆమె ఈ  ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేసింది. "ఘోస్ట్ అండ్ డార్క్ నెస్" అనే ఇంగ్లీష్ మూవీ ఆధారంగా ఈ చిత్రాన్ని మొదట జయంత్.సి.పరాన్జీ తెరకెక్కించాలనుకొన్నాడట.కానీ దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టినా.. మెగాస్టార్ క్రేజ్ కారణంగా సినిమాకు కొన్ని అగ్రిమెంట్ లతో బిజినెస్ బాగానే జరిగింది ఆడియో రైట్స్  కోటి రూపాయలకు అమ్ముడుపోయాయి.

 ఇక 2001 జనవరి 11న ఈచిత్రం గ్రాండ్ గా రిలీజ్ అయింది. మొదటి షో  నే అభిమానులను బాగా మూడ్ ఆఫ్ చేసింది. ఇక అదే రోజు నందమూరి బాలకృష్ణ నటించిన "నరసింహ నాయుడు" కూడా విడుదలైంది. ఇక ఆ సినిమా భారీ విజయపతాకం ఎగరవేయగా, మృగరాజు సినిమా భారీగా ఫ్లాప్  కొట్టడం గమనార్హం. ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టకున్న నిర్మాత కూడా పూర్తిగా తన  ఆస్తులని అమ్ముకోవాల్సి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: