సత్యం కంప్యూటర్స్.. సత్యం రామలింగరాజు.. ఈ పేర్లను వినని తెలుగ వారు ఉండరు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో అంతలా ఈ పేర్లు ఒకప్పుడు ఒక ఊపు ఊపాయి. సత్యం కంప్యూటర్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడంటే తమ కూతురిని కళ్లు మూసుకుని అబ్బాయితో వివాహం జరిపించేసే వారు. అంతలా సత్యం కంప్యూటర్స్‌కు ఒకప్పుడు పేరు ఉండేది. కానీ 2009లో సత్యం కంప్యూటర్స్ కుంభకోణం ఒక్కసారిగా బయట పడటంతో రామలింగరాజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కంపెనీ షేర్లు అమాంతం పడిపోగా.. ఆయనేమో జైలు జీవితం గడపాల్సి వచ్చింది. 7 వేల కోట్ల కుంభకోణం జరిగిందంటూ కోర్టు నిర్థారించి రామలింగరాజుకు ఏడు సంవత్సరాలు జైలు శిక్షను విధించింది. అనంతరం తమ కేసును విచారించాలంటూ అప్పీలు దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు ఆ శిక్షను ఆపడం కూడా జరిగిపోయింది.

ఇప్పుడు అసలు సత్యం రామలింగరాజు గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. తాజాగా ‘నాట్యం’ అనే సినిమా పోస్టర్ విడుదలైన సంగతి తెలిసిందే. మెగా కోడలు ఉపాసన కొణిదెల ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది సంధ్య రాజు. సంధ్య అంటే ఎవరికి తెలియకపోవచ్చు కానీ సత్యం రామలింగరాజు కోడలు అంటే మాత్రం ఎవరైనా టక్కున పెద్దింటి అమ్మాయి అని చెప్పేస్తారు. ఓ భారీ సిమెంట్ సంస్థను నడుపే కుటుంబానికి చెందిన సంధ్య రాజును రామలింగ రాజు కుమారుడు రామ రాజు వివాహం చేసుకున్నారు.

ఆమెకు చిన్నప్పటి నుంచి నాట్యం అంటే ఎంతో ఇష్టమట. ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చి అనేక మంది ప్రశంసలు కూడా పొందారు. ఇక నాట్యం సినిమా ఆమె మొదటి సినిమా కాదండోయ్. యూటర్న్ సినిమా మలయాళం వెర్షన్‌లో సంధ్య నటించారు. ఇప్పుడు నాట్యం ఆమె నటిస్తున్న రెండో సినిమా. రామలింగ రాజు కుటుంబం నుంచి సంధ్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడంతో అందరూ ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: