హీరోయిన్లను శృంగార దేవతలుగా చూపించడంలో కె.రాఘవేంద్రరావు తరువాతనే ఎవరైనా అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఆయన హీరోయిన్ల నాభిపై పూలు, పండ్లు వేస్తూ పాటలను అత్యంత శృంగార భరితంగా రూపొందిస్తారు. రాఘవేంద్రరావు సినిమాల్లోని పాటల కోసమే ప్రేక్షకులు థియేటర్లకు పలుమార్లు వెళ్లేవారు అంటే అతిశయోక్తి కాదు. 100 పైగా చిత్రాలకు డైరెక్షన్ చేసిన ఆయన ఎందరో హీరోయిన్ల బొడ్డుపై పండ్లను కొట్టించారు. తాప్సీ పన్ను బొడ్డు పై ఏకంగా కొబ్బరిచిప్పలు కొట్టించారు. నిజానికి ఆమె నాభి అందాలను చాలా సెక్సీ గా చూపించడం తో రాఘవేంద్రరావు కి కుర్రకారు కృతజ్ఞతలు చెప్పుకున్నారంటే అతిశయోక్తి కాదు.

నగ్మా, స్నేహ వంటి హీరోయిన్ల తడి అందాలను రకరకాల కెమెరా యాంగిల్స్ లలో చూపిస్తూ వారి బొడ్డుపై బంతి పూలు, యాపిల్ పండ్లు, ద్రాక్ష పండ్లు వంటివి కట్టిస్తూ టాలీవుడ్ ప్రేక్షకులకు నిద్రలేని రాత్రులను మిగిల్చారు. అయితే మరి రాఘవేంద్రరావు మొట్టమొదటిగా ఏ హీరోయిన్ పై పండ్లు పూలు వినియోగించారో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

1988లో రాఘవేంద్రరావు దర్శకత్వం లో 'మంచి దొంగ' సినిమా విడుదలయ్యింది. ఈ మూవీలో చిరంజీవి, సుహాసిని, విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాలోని "బెడ్ లైట్ తగ్గించినా" అనే పాట చిరంజీవి, విజయశాంతిల ఫస్ట్ నైట్ నేపథ్యంలో కొనసాగుతుంది. కాగా, రాఘవేంద్రరావు ఈ పాటలో విజయశాంతి పై పండ్లను వినియోగించారు. ఈ సినిమాకి ముందు రాఘవేంద్రరావు పలు సినిమాల్లో పూలు, పండ్లను వినియోగించారు కానీ హీరోయిన్ పై పూలు, పండ్ల తో అభిషేకం చేయలేదు.

అయితే తొలిసారిగా విజయశాంతి పైనే ఆయన పూలు, పండ్లను విసరడం జరిగింది. ఐతే రాఘవేంద్రరావు పూలు పండ్లు వినియోగించి విజయశాంతి ని సెక్సీగా చూపించిన తీరుకి అప్పటి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి.. లైట్ ఆఫ్ చేసినప్పుడు ఒకలా లైట్ ఆన్ చేసినప్పుడు మరొకలా సంగీతం అందించి ఈ పాటను అద్భుతంగా స్వరపరిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: