టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చివరిసారిగా 2020లో జాను అనే సినిమాలో కనిపించింది. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన జాను సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అందుకేనేమో ఈ సినిమా విడుదలైన తర్వాత ఆమె తెలుగులో తన తదుపరి సినిమా సంతకం చేయడానికి చాలా సమయం తీసుకుంది. ఎట్టకేలకు ఆమె దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలము అనే సినిమాకి ఓకే చెప్పింది. అయినా ఆ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ఆమె నటిస్తున్న ఈ పౌరాణిక నాటకం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది.

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకి గాను సమంతా 150 రోజులు కేటాయించిందని అంటున్నారు. ఒక స్టార్ నటి ఇన్ని రోజులు కాల్షీట్స్ కేటాయించడం అంటే అది మామూలు విషయం కాదు. అందుకే ఈ శాకుంతలం సినిమా చేసేందుకు గాను ఏకంగా 3 కోట్లు అందుకుంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో సమంత కి జోడీగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాని గుణశేఖర్ తన సొంత బ్యానర్ అయిన గుణా టీం వర్క్స్ పతాకంపై ఈ ప్రాజెక్టును  నిర్మిస్తున్నారు. మణి శర్మ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు.

అయితే ఆ మధ్య ఈ భామ రెమ్యునరేషన్ విషయంలో కీలక కామెంట్స్ చేసింది. ఇండస్ర్టీలో టాప్‌ 3లో ఉన్న హీరోయిన్‌కు కనీసం టాప్‌ 20కూడా లేని హీరోకు ఇచ్చే రెమ్యునరేషన్‌ కంటే తక్కువగానే ఇస్తారని చెప్పుకొచ్చింది. ఒకవేళ రెమ్యునరేషన్‌ పెంచితే ఆమె భారీగా  డిమాండ్‌ చేస్తుందని అత్యాశ అనే ముద్ర వేస్తారని పేర్కొంది. అదే హీరో అడిగితే మాత్రం అభ్యంతరం చెప్పరని అతను సక్సెస్‌లో ఉన్నాడని సమర్థిస్తారని చెప్పుకొచ్చింది. హీరోయిన్లు రెమ్యునరేషన్‌ ఎక్కువ అడిగితే అదేదో క్రైమ్‌లా చూస్తారని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: