కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య..భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలకపాత్ర పోషించారు.. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా మే 13 న విడుదల కానుంది.. ఇక ఈ సినిమా తర్వాత లూసిఫార్ రిమేక్ లో నటించనున్నాడు చిరు.. అయితే తాజాగా ఈ సినిమాకి నటీనటులనుంచి పెద్ద సమస్య వచ్చి పడింది. మెగాస్టార్ సినిమాకి ప్యాడింగ్ ఆర్టిస్ట్ లు దొరకడం లేదు. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా, ఈ సినిమాకి 'క్యాస్టింగ్' అసలు కుదరట్లేదు.

నిజానికి ఈ సినిమా 'క్యాస్టింగ్'ను ఎప్పుడో ఫైనల్ చేశారు.మార్చి సెకెండ్ వీక్ నుండి షూట్ చేద్దామని మేకర్స్ షెడ్యూల్ వేయడం, ఆ షెడ్యూల్ కి తగ్గట్లు నటీనటులను ఎంపిక చేయడం జరిగిపోయింది.అయితే ఈ సినిమా షూట్ అనుకోకుండా పోస్ట్ ఫోన్ అయింది. దాంతో ఇంతకుముందు ఫైనల్ చేసిన నటులు ఇప్పుడు డేట్స్ సమస్య అంటూ నసుగుతున్నారని సమాచారం. ఆ డేట్స్ సమస్యను వ్యక్తపరుస్తోన్న వాళ్లల్లో నాజర్, సంపంత్, అతుల్ కులకర్ణి, అలాగే పవిత్రా లోకేష్ ఇలా కొంతమంది వేరే సినిమా షూట్ లో ఫుల్ బిజినా ఉన్నారు. వీళ్ళను నమ్ముకుని షూటింగ్ ప్లాన్ చేసుకున్న వేరే సినిమాల మేకర్స్, ఇప్పుడు వీళ్ళను వదిలితే..

 తమ షూటింగ్ కాస్ట్ అంతా వేస్ట్. అందుకే వీళ్ళు కూడా మెగాస్టార్ సినిమా అయినప్పటికీ ఒప్పుకున్న సినిమాలను మధ్యలో వదిలేసి రాలేక, మెగాస్టార్ సినిమా చేయలేమని ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నారు.పైగా ఈ సినిమాలో కీలకమైన ఐదు ఇతర పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలకు మంచి నటులు కావాలి. దర్శకుడు మోహన్ రాజా ప్రసుతం నటులను వెతికే పనిలో ఉన్నాడు. మరి అనుకున్న నటులు దొరికితే గనుక, ఈ నెలలోనే రెగ్యులర్ షూట్ ఉండే అవకాశం ఉంది. మలయాళంలో మోహన్ లాల్ చేసిన పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు. ఈ సినిమాని మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: