ప్రస్తుతం రామ్ చరణ్ రెండు సినిమాల షూటింగులతో బిజీ గా ఉన్నాడు. ఒకటి తన తండ్రితో నటిస్తున్న ఆచార్య మూవీ కాగా, మరొకటి దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ... ఇవి రెండూ సెట్ మీద ఉండగానే మరో మూవీ ప్రకటించేశాడు. ఈ మూవీ ఒక కొత్త కాంబినేషన్ లో రూపుదిద్దుకోబోతోంది. తమిళ దర్శకుడు అయిన శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. శంకర్ మూవీ అనగానే ప్రేక్షకులు ఏదో ఒక మాయను కొత్తదనాన్ని ఆశిస్తారు. దీనికి రామ్ చరణ్ అనే ఆయుధం తోడైతే ఇక ఆ మూవీ ఏ విధంగా ఉండనుందో అని అంతా ఉత్కంఠగా ఉన్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

దీనికి నిర్మాతలుగా దిల్ రాజు శిరీష్ లు ఉండనున్నారు. ఈ సినిమా ప్రకటించిన నాటి నుండి ఈ రోజుటి వరకు ఏదో ఒక వార్త ఈ సినిమా గురించి వస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు మరొక వార్త జోరుగా ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పోలీస్ పాత్రకు అవకాశం ఉందట...దాదాపుగా హీరోకి ధీటుగా నిలిచే పాత్ర కావడంతో, ఆ పాత్రలో ప్రముఖ స్టార్ హీరోని తీసుకోవడానికి చిత్ర బృందం ప్రయత్నిస్తోందని బాలీవుడ్ మీడియా తెలిపింది. దీనికి బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరైన కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో మాట్లాడుతున్నట్లు వినికిడి. ఈ సినిమా ఎలాగూ పాన్ ఇండియా మూవీ కావడం వలన సల్మాన్ ఖాన్ అయితే సరిగ్గా షూట్ అవుతారని చిత్ర బృందం ఆలోచిస్తున్నారట. ఈ  పాత్ర కోసం మొత్తంగా ఒక 30 రోజుల డేట్స్ అవసరమయ్యే అవకాశం ఉందట.

చిత్ర బృందం అనుకోవడంలో తప్పు లేదు..కానీ రామ్ చరణ్ తో నటించడానికి సల్మాన్ ఖాన్ ఒప్పుకుంటారా లేదో చూడాలి. అయితే సల్మాన్ ఖాన్ నో చెప్పడానికి ఛాన్స్ లేకుండా..శంకర్ డైరెక్టర్ గా ఉన్నాడు. కానీ సల్మాన్ ఒప్పుకుంటే మాత్రం ఇది ఒక డ్రీం కాంబో గా నిలుస్తుందని అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. శంకర్ అన్ని సినిమాల లాగే ఈ సినిమా కూడా ఒక సందేశాత్మక చిత్రంగా రూపొందుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులతో పాటుగా నటీనటులను సాంకేతిక నిపుణులను ఎంపిక చేస్తున్నారని తెలుస్తోంది. సంగీత మాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించనున్నాడనే తెలుస్తోంది. రామ్ చరణ్ ఖాళీ అయ్యాక జూన్ లేదా జులై నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: