సినీ పరిశ్రమకు సమ్మర్ సీజన్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే సమ్మర్ లో సెలవులు ఎక్కువగా ఉండటం, కారణంగా సినిమాలు ఎక్కువగా చూస్తారని వారి నమ్మకం. కానీ కరోనా కారణంగా ఇప్పటికే 2020 సమ్మర్ పూర్తిగా ఎగిరిపోయింది. ఇక ఇప్పుడు 2021 సమ్మర్ కూడా అయిపోయినట్లే కనిపిస్తోంది. ఏప్రిల్ మొదటివారం"వకీల్ సాబ్" సినిమాతో సినిమా జాతర మొదలు కావాల్సి ఉంది.  ఇక వకీల్ సాబ్ సినిమా మంచి హిట్ టాక్ రావడంతో జనాలు థియేటర్లకు క్యూ కట్టడంతో, శివుడికి పూర్వ వైభవం వచ్చిందని అన్నారు. కానీ అంతలోనే ఏపీ టికెట్ల ధర గొడవ మొదలైంది.. దీంతో సినిమాలన్నీ వాయిదా పడటం మొదలయ్యాయి.


దీంతో ఈనెల 16న రావాల్సిన 'లవ్ స్టోరీ' సినిమా వాయిదా పడింది. అలాగే 23న రావాల్సిన'టక్ జగదీష్' కూడా అదే దారిలో వెళ్ళింది. ఇక విరాటపర్వం సినిమా తో  పాటు 'పాగల్ ' లాంటి చిన్న సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. ఈ సినిమాలన్నీ ఏప్రిల్లో రావాల్సి ఉండగా, పక్కకు తప్పుకున్నాయి . ఇక అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా కూడా వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా జూన్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.


నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా 'అఖండ '. ఈ సినిమా మే లో రావాల్సి ఉండగా, ఈ సినిమాకి సంబంధించిన వర్క్ ఇంకా బ్యాలెన్స్ ఉందని,  కరోనా  ఇలాగే కొనసాగితే వర్క్ ఇంకా ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మరో నెల వరకు సరైన సినిమాలేవి లేవని తెలుస్తోంది. ఇక బాలయ్య 'అఖండ'  సినిమా విడుదల కాకపోతే పెద్ద సినిమాలేవీ లేకుండా సమ్మర్ పూర్తవుతుంది. సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న స్టార్ హీరోల సినిమాలు కరోనా కారణంగా వాయిదా పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇక ఇప్పుడు ఈ సినిమాలు రిలీజ్ అవ్వకపోతే  మిగులుతుందని చెప్పవచ్చు.. ఏది ఏమైనా సమ్మర్ తర్వాత అయినా  సినిమాలు రిలీజ్ అవుతాయో లేదో చూడాలి మరీ..

మరింత సమాచారం తెలుసుకోండి: