కొన్ని కొన్ని సినిమాలు థియేటర్లలో అట్టర్ ఫ్లాప్ గా నిలిచినా కూడా బుల్లితెరపై సూపర్ హిట్ అవుతాయి. బుల్లితెరపై కూడా అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన సినిమాలు యూట్యూబ్ లలో సూపర్ హిట్ గా నిలుస్తాయి. అలా మన టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు వెండితెర, బుల్లితెర ప్రేక్షకులకు నచ్చకుండా ఉండగా డిజిటల్ ప్రేక్షకులకు మాత్రం విపరీతంగా నచ్చాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మన దగ్గర ఫ్లాప్ అయిన సినిమాలు వేరే భాషల్లో డబ్ అయ్యి, రీమేక్ అయ్యి హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈమధ్య సినిమాలకు యూట్యూబ్ బిజినెస్ బాగా పెరిగిపోవడంతో ఇతర భాషల్లోకి మన సినిమాలను డబ్ చేస్తున్నారు. అలా ప్రతి హీరో సినిమా కూడా ఇతర భాషల్లోకి డబ్ అయ్యి అక్కడి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అందులో తెలుగునాట హిట్ అయిన సినిమాలు, ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే హిట్ అయిన సినిమాలకి మంచి వ్యూస్ రావడం కామనే కానీ టాలీవుడ్ లో ఫ్లాప్ అయిన సినిమాలకు కూడా మంచి న్యూస్ లభిస్తూ డిజిటల్ హిట్ లు నిలుస్తున్నాయి.. అలా తెలుగునాట ఛీ కొట్టిన సినిమాలని ఇతర భాషల్లో డబ్ చేస్తే మిలియన్ వ్యూస్ దక్కించుకుని సూపర్ హిట్ లుగా నిలిచాయి.. ఆ సినిమాలో ఇప్పుడు చూద్దాం..

విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ తెలుగులో హిట్ కాకపోయినా మలయాళంలోకి డబ్ అయ్యి 20 మిలియన్ల  వ్యూస్ పొందింది. బెల్లంకొండ శ్రీనివాస్ జయ జానకి నాయక సినిమా 300 మిలియన్ల న్యూస్ సాధించింది. విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమా 167 మిలియన్ల వ్యూస్ ని సంపాదించగా, ప్రభాస్ రెబల్ 59 మిలియన్ల మంది వీక్షించి డిజిటల్ హిట్ చేశారు. నితిన్ శ్రీనివాస కళ్యాణం 129 మిలియన్ల వ్యూస్, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా 99 మిలియన్ల వ్యూస్, సీత 97 మిలియన్ల వ్యూస్, ఆగడు 67 మిలియన్ల వ్యూస్, ద్వారక 47 వ్యూస్, తుఫాన్ 8 మిలియన్ల వ్యూస్, అఖిల్ 5 మిలియన్ వ్యూస్, బద్రినాథ్ 3.8 మిలియన్ల  వ్యూస్, బ్రహ్మోత్సవం 3.4 మిలియన్ల వ్యూస్ అందుకున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: