టాలీవూడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి గురించి తెలియని వారంటూ ఉండరు. నందిని రెడ్డి అలా మొదలైంది’ సినిమాతో దర్శకురాలిగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది. సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓ బేబీ. ఇక సమంతతో తెరకెక్కించిన ‘ఓ బేబి’తో నందిని రెడ్డి పేరు మరోసారి వినిపించింది.

ఓ బేబీ మూవీ కథ విషయానికి వస్తే బేబీ(లక్ష్మి) ఎప్పుడూ ఏదో కోల్పియినట్లు అసహనంగా ఉండే ఓ బామ్మ. ఈమె ఓ క్యాంటీన్ ని నడుపుతూ ఉంటుంది. ఆమె మితిమీరిన డామినేషన్,చాదస్తాన్ని తట్టుకోలేక పోతుంటుంది ఆమె మనవరాలు. ఈ కుటుంబ మనస్పర్ధలతో బేబీ ఇంటినుండి గెంటివేయబడుతుంది.

అలా నిరాశ్రయురాలైన బేబీ జీవితంలో ఊహించని సంఘటన జరుగుతుంది. తన కోరిక ప్రకారం వృద్ధురాలైన బేబీ యంగ్ లేడీగా మారిపోతుంది. మరొక మారు యవ్వనంలోకి ప్రవేశించిన బేబీ(సమంత) ఆ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంది, ఈ ఊహించని ప్రయాణంలో ఆమెకు ఎదురైన సంఘటనలను ఎలా ఎదుర్కొంది అనేవి తెరపై కనువిందుగా చూపించారు.

ఇక కొత్త కథను ఎంచుకోవడంతో పాటు, ఎంచుకున్న కథను అద్భుతంగా తెరపై ఆవిష్కరించడంలో డైరెక్టర్ నందిని రెడ్డి విజయం సాధించారు. తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా ఆమె కథను చిత్రీకరించిన తీరు అభినందనీయం. ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలతో పోల్చితే నందిని రెడ్డి అత్యుత్తమ సినిమాగా ఓ బేబీ నిలిచింది.

ఇంతకుముందు నందిని రెడ్డిసమంత ల కాంబినేషన్ లో జబర్దస్త్ వంటి డిజాస్టర్ వచ్చింది . కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత ఓ బేబీ వంటి బ్లాక్ బస్టర్ వచ్చింది . ఓ బేబీ సూపర్ హిట్ కావడంతో అటు సమంత ఇటు నందిని రెడ్డి ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు . అందుకే మళ్ళీ సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యారట . కాకపోతే మంచి కథ సెట్ అయ్యాకే చేయాలనీ డిసైడ్ అయ్యారట .

మరింత సమాచారం తెలుసుకోండి: