దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, హీరో అజయ్ దేవగణ్, హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ వంటి నటీనటులను రాజ ఈ సినిమాలో ఉండడంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమ షూటింగ్ కూడా ఇంకా పూర్తి కూడా కాలేదు. అయినా అప్పుడే ఈ సినిమాకు భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి. రిలీజ్ కూడా కాకుండానే సరికొత్త రికార్డులను బ్రేక్ చేస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీ హక్కుల కోసం ఇప్పటికే జీ స్టూడియోస్ సంస్థ శాటిలైట్, డిజిటల్ హక్కుల కోసం భారీ మెత్తాన్నే చెల్లించింది. ఈ డీల్ విలువ ఏకంగా రూ.325 కోట్లు కావడం గమనార్హం. దీంతో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఓటీటీలో జీ5 సంస్థ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. ఇక హిందీతో పాటు ఇంగ్లీష్, పోర్చుగీస్, కొరియన్, తుర్కిష్, స్పానిష్‌ భాషలలో నెట్ ఫ్లిక్స్ విడుదల చేయనుంది. హిందీ మినహా.. మిగతా భాషల్లోకి డబ్ చేసే బాధ్యత కూడా నెట్ ఫ్లిక్స్ తీసుకోవడం గమనార్హం.

భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా ఉన్నారు. ఇంత భారీ బడ్జెట్‌లో నిర్మితమవతున్న చిత్రం కావడం, అందులోనూ రాజమౌళి సినిమా కావడంతో ఈ చిత్రం శాటిలైట్ హక్కలు కూడా భారీ ధరే పలుకుతోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ శాటిలైట్ హక్కులను కూడా జీ సినిమా సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ, కన్నడలో స్టార్ ఛానెల్స్‌ ప్రసారం చేయనుంది.

మలయాళం వెర్షన్‌ శాటిలైట్ హక్కులను ఏషియన్ నెట్‌ దక్కించుకుంది. వీటితో పాటు పెన్ మరుధర్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ హిందీలో థియేట్రికల్ రైట్స్‌ను దక్కించుకుంది. కాగా.. అన్నీ అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ 13న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ మేరకు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేసింది.




మరింత సమాచారం తెలుసుకోండి: