సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు మధ్య లవ్ ఎఫైర్లు ఉండటం అనేది కామన్.సినిమా షూటింగ్ సమయంలో స్నేహితులు అవ్వడం తరువాత ఆ స్నేహం ప్రేమగా మారి పెళ్లి దాకా వెళ్లి ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక సమంత - సిద్ధార్థ విషయంలో కూడా అలానే జరిగింది. సమంత నాగ చైతన్యని పెళ్లి చేసుకోకముందు సిద్ధార్ధతో కొన్ని రోజులు ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే. అప్పట్లో వీరి వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. అప్పుడప్పుడే స్టార్ హీరోయిన్ గా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదుగుతూ పోతున్న సమయంలో సమంత సిద్ధార్ధ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. సిద్ధార్థ పెద్ద సీనియర్ హీరో. ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి కొనసాగుతున్నాడు.అలాగే కెరీర్ లో చాలా పెద్ద పెద్ద దర్శకులతో పని చేసి స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక సిద్ధార్థ లాంటి హీరో సరసన అవకాశం రావడంతో సమంత ఎస్ చెప్పేసింది.

ఇక నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన "జబర్దస్త్" సినిమాలో వీరు హీరో హీరోయిన్స్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పొయ్యిందో తెలీదు కాని సమంత, సిద్దార్ధల లవ్ స్టోరీ మాత్రం అప్పుడు ఇండస్ట్రీలో హాట్ న్యూస్ అయ్యింది.ఆ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు లవ్ లో పడ్డారు. పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారు. కొన్ని రోజులు పాటు వీరిద్దరి మధ్య లవ్ బాగానే సాగింది. కాని అంతలో ఏమైందో తెలీదు.ఇద్దరూ బాగా తిట్టుకొని విడిపోయారని అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. ఆ టైములో ఇదో పెద్ద చర్చనీయాంసంగా మారింది. జబర్దస్త్ సినిమా లాగే వీరి ప్రేమ కూడా ఎప్పుడు పొయ్యిందో తెలీక పెద్ద డిజాస్టర్ అయ్యింది.ఇక ఆ తరువాత సిద్దు వరుస ప్లాపులతో సతమతమవుతూ ఉంటే సమంత మాత్రం పెద్ద స్టార్ హీరోల సినిమాలలో ఛాన్సెస్ దక్కించుకొని పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది. తరువాత తన సహనటుడు నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తూ మంచి మంచి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక సిద్ధార్ధ విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో 'మహాసముద్రం' సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: