బాలీవుడ్‌లో ఫ్రెండ్లీ డివోర్స్ కల్చర్ నానాటికీ పెరిగిపోతోంది. విడాకులు తీసుకొని విడిపోయినా కలిసుంటామంటున్నారు బాలీవుడ్ స్టార్స్. భార్యాభర్తలుగా విడిపోయినా తల్లిదండ్రులుగా కలిసుంటామంటున్నారు. పిల్లలు పుట్టాక లైఫ్‌ పార్టనర్‌పై ప్రేమ తగ్గుతుందని చాలామంది చెప్తుంటారు. వాళ్ల ప్రేమ మొత్తం పిల్లలపైకి షిఫ్ట్ అవుతుంది అంటారు. ఈ ప్రేమతోనే భార్యాభర్తలుగా విడిపోయిన చాలామంది బాలీవుడ్ కపుల్స్‌, అమ్మానాన్నలుగా కలుస్తున్నారు. పిల్లల పెంపకంలో పాలుపంచుకుంటున్నారు.

ఆమిర్ ఖాన్, కిరణ్ రావు విడాకుల వార్త  బాలీవుడ్‌ జనాలను అవాక్కయ్యేలా చేసింది. ఈ జంట విడిపోవడానికి ప్రధాన కారణంపై అందరూ ఆరాతీస్తున్నారు. అయితే ఈ జంట మాత్రం విడాకులు తమ మంచికే అన్నట్టుగా ప్రకటన ఇచ్చారు.  ఎంతో సక్సెస్ గా సాగిన అమిర్ ఖాన్, కిరణ్ రావు 15 ఏళ్ల వివాహ బంధం నుంచి దూరమవుతున్నా, ఫ్రెండ్స్‌లాగే ఉంటామని, కొడుకు ఆజాద్‌ని కలిసి చూసుకుంటామని ప్రకటన చేశారు.

హృతిక్ రోషన్, సుశానే ఖాన్ విడిపోయినప్పుడు సోషల్‌ మీడియాలో రకరకాల కామెంట్స్‌ కనిపించాయి. హృతిక్‌ ఎఫెర్స్‌తో వీళ్లిద్దరి మధ్య పెద్ద గొడవలు జరిగాయని, భార్యకి భరణంగా 400 కోట్ల వరకు ఇచ్చాడనే ప్రచారం జరిగింది. దీనిపై హృతిక్ ఫ్యాన్స్ కౌంటర్లతో పెద్ద హంగామా కూడా చేశారు. అయితే జనాలు ఇంత ఇష్యూ చేశారు గానీ ఈ కపుల్‌ మాత్రం ఇప్పటికీ ఫ్రెండ్‌షిప్‌ని కంటిన్యూ చేస్తున్నారు. హృతిక్ రోషన్, సుశానే ఖాన్ భార్యాభర్తలుగా విడిపోయినా అమ్మానాన్నగా వాళ్ల బాధ్యతలు నెరవేరుస్తున్నారు.

మలైక అరోరా ఖాన్, అర్భాజ్ ఖాన్ విడిపోయి చాలా రోజులు అయ్యింది. ఇక మలైక, అర్జున్‌ కపూర్‌ని పెళ్లి చేసుకుంటుందనే మాటలు కూడా చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. ఇక అర్భాజ్ ఇటలీ మోడల్ జార్జియా ఆండ్రియానితో రిలేషన్‌లో ఉన్నాడనే టాక్ కూడా ఉంది. అయితే వీళ్ల రిలేషన్స్ ఎలా ఉన్నా, మలైక, అర్భాజ్ ఇద్దరూ కొడుకు అర్హాన్ ఖాన్‌ కోసం కలుస్తూనే ఉంటారు. పేరెంటింగ్ రెస్పాన్సిబిలిటీని నిర్వర్తిస్తుంటారు.

అమృత సింగ్‌ని పెళ్లి చేసుకోవడానికి ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీ ఖాన్ చాలా పోరాటాలు చేశాడు. తనకంటే 13 ఏళ్లు పెద్దదైన అమృతని పెళ్లికి ఒప్పించడానికి దీక్షలు లాంటివి చేశాడు సైఫ్. అయితే ఇంత పోరాడి పెళ్లి చేసుకున్న వీళ్లిద్దరు 13 ఏళ్ల తర్వాత విడిపోయారు. ఈ డివోర్స్ టైమ్‌లో అమృతకి 5 కోట్లు భరణంతో పాటు, కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్‌కి 18 ఏళ్లు వచ్చే వరకు నెలకి లక్షరూపాయలు ఇచ్చాడు.

సైఫ్ అలీఖాన్‌ భర్తగా అమృతకి దూరమైనా తండ్రిగా పిల్లలకి టచ్‌లోనే ఉన్నాడు. సారా అలీ ఖాన్‌ కెరీర్‌లో సైఫ్ తండ్రిగా సలహాలు ఇస్తోంటే, అమృత తోడుగా ఉంటోంది. ఇప్పుడు ఇబ్రహీం అలీఖాన్‌ని హీరోగా లాంచ్‌ చెయ్యడానికి పరిచయాలని వాడుతున్నాడని చెప్తున్నారు. ఇక సారా, ఇబ్రహీం కూడా సైఫ్ రెండో పెళ్లికి మద్దతిచ్చారు. కరీనా కపూర్‌తోనూ మంచి రిలేషన్‌ని మెయింటైన్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: