
విశ్వరూపం-2 సినిమాతో 2018లో ప్రేక్షకులను పలకరించారు లోకనాయకుడైన కమల్ హాసన్. ఆ సినిమా కొన్నేళ్ల పాటు వాయిదాపడి వాయిదాపడి విడుదలైంది. చివరగా రిలీజైన కమల్ రెగ్యులర్ మూవీ చీకటి రాజ్యం ఒక్కటే అని చెప్పుకోవచ్చు. ఆ సినిమాను మంచి అంచనాల మధ్య విడుదల చేశారు. చీకటి రాజ్యం ప్రమోషన్లలో కూడా పాల్గొన్నారు. దీని తర్వాతే విశ్వరూపం-2 వచ్చింది. రెండేళ్ల కిందట మొదలుపెట్టిన ఇండియన్-2 ఇంతవరకు అతీగతీ లేకుండా పోయింది. ఆ సినిమాను అలా వదిలేసి విక్రమ్ అనే కొత్త చిత్రాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఖైదీ, మాస్టర్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
రెండు భాషల్లోను అమితాసక్తి
విక్రమ్ సినిమాను ప్రకటించినప్పుడు.. ప్రీ టీజర్ విడుదల చేసినప్పుడు తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో బాగా ఆసక్తిని రేకెత్తించింది. కమల్ సినిమాకు సంబంధించి ఒక ఫస్ట్ లుక్ విడుదలై చాలా సంవత్సరాలు గడిచిందంటే అతిశయోక్తి కాదు. సామాజిక మాధ్యమాల్లోను అభిమానులు మంచి యాక్టివ్ అవుతున్నారు. లోకనాయకుడు కమ్ బ్యాక్ అంటూ సందడి సందడి చేస్తుండటంతోపాటు పాజిటివ్ ట్రోలింగ్‌తో హోరెత్తిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్, యాక్షన్ మూవీ కావడంతో విక్రమ్‌పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. కమల్‌ను ఫస్ట్ లుక్‌లో లోకేష్ ఎలా ప్రెజెంట్ చేశాడో టీజర్ విడుదలైతేకానీ తెలియదు. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ పుష్పలోనూ ఫాజిల్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడు ఎన్నికలు ముగిసిన తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న కమల్‌హాసన్ ఆ తర్వాత సినిమాల్లో నటించేందుకు యాక్టివ్ అయ్యారు. రాజకీయ పార్టీ స్థాపన, అనంతరం ఎన్నికల్లో పోటీచేయడం, నేతలంతా పార్టీని వీడుతుండటంతోపాటు తప్పులు ఎక్కడ జరిగాయో తెలుసుకోవడానికే ఇంత సమయం పట్టిందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇకనుంచి పూర్తిస్థాయిలో సినిమాలపై దృష్టిసారించి అభిమానులను అలరించడానికి కమల్ సిద్ధమయ్యారని ఆయన అభిమానులు గర్వంగా చెబుతున్నారు. కమల్ నుంచి పూర్తిస్థాయిలో ఒక మంచి యాక్షన్ మూవీ కావాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ డిమాండ్‌ను విక్రమ్ ఎంతవరకు భర్తీచేయగలదో సినిమా విడులైనప్పుడే తెలవనుంది.