హీరోయిన్ గౌతమి గురించి టాలీవుడ్ లో ప్రత్యేక మైన పరిచయం అవసరం లేదు. అలనాటి నటిమణులలో ఈమెకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దయామయుడు అనే సినిమాలో నటించి ఆమె తెలుగులో ఎంట్రీ ఇవ్వగా గాంధీ నగర్ రెండో వీధి సినిమా ద్వారా పూర్తిస్థాయి నటిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బజార్ రౌడీ, అగ్గి రాముడు , చైతన్య, అన్న, మనమంతా, చిలక్కొట్టుడు వంటి చిత్రాలతో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగుతోపాటు తమిళ మలయాళ హిందీ భాషల్లో సైతం నటించిన ఈ హీరోయిన్ కెరీర్ తొలినాళ్ళలో ఓ ప్రమాదంలో చిక్కుకుnన్నారట.

ఆమె ఓ కన్నడ సినిమా చేస్తుండగా చిక్ మంగళూరు దగ్గరలో ఉన్న కుద్రేముఖ్ ఔట్ డోర్ షూట్ కోసం వెళ్లారు. అక్కడ క్లైమాక్స్ సీన్ చిత్రీకరిస్తున్నారు. హీరో అంబరీష్ రోడ్డు మీద నడుస్తూ ఉంటే హీరోయిన్ గౌతమి కొండ మీద నుంచి ఆయనను పిలుస్తూ కిందకు రావాలి. ఈ సీన్ లో గౌతమి కొండమీద నిలుచున్నారు. కింద కెమెరా ఫిక్స్ చేశారు. డైరెక్టర్ గౌరీ శంకర్ యాక్షన్ అని చెప్పగా ఆ కొండ మీద నుంచి కిందకు దిగుతున్నారు. ఆ కొండమీద గోతులు పిచ్చి మొక్కలు మల్లు లాంటివి అడుగడుగునా ఉన్నాయి. ఆమెకు ఆ సీన్ చేయడం కొంచెం కష్టం అయ్యింది. అందులోనూ ఆమె సాంప్రదాయబద్ధమైన చీరకట్టులో ఉన్నారు.

 డైరెక్టర్ యాక్షన్ చెప్పగా ఆ సమయంలో ఇన్వాల్వ్ అయిపోయి నటిస్తూ హీరో ను పిలుస్తుండగా అప్పుడే రాయి తగిలి కిందపడి లేచింది. అయితే గౌతమి చీర కుచ్చిల్లు ఆమె పాదాల వద్దకు జారి రావడంతో అలా అలా తూల పోయింది. గౌతమి పడిపోవడం చూసి అక్కడ ఉన్న ఓ యూనిట్ సభ్యులు వెంటనే ఆమెను పట్టుకున్నాడు. లేకపోతే దొర్లుతూ వెళ్లి రోడ్డు మీద పడి చనిపోయేవారట. దాంతో ఆమెకు దాదాపు ప్రాణాపాయం తప్పిందని అంతా అనుకున్నారు. ఇప్పటికే ఆమె ఆరోజు జరిగిన ఘటన ను తలుచుకుంటే ఆమెకు ఇప్పటికీ భయం కలుగుతుందట. నిజానికి ఈ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ప్రమాదాలు ద్వారా నటీనటులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: