బీటౌన్ టాల్ బ్యూటీ తన హైట్ వల్ల కాస్ట్లీ కారు లాంబర్గిని లోంచి దిగడానికి అష్టకష్టాలు పడింది. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా తన బోల్డ్ ఫ్యాషన్ ఎంపికతో తరచుగా వార్తల్లో నిలుస్తుంది. బాలీవుడ్‌లో ఈ బ్యూటీ తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేడుకుంది. ఊర్వశికు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా దర్శనం ఇస్తుంటాయి. సోమవారం (జూలై 26) ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస ఫోటోలను పంచుకున్నారు. స్నాప్స్‌లో బేబీ పింక్ కోట్‌తో జత చేసిన ఆకుపచ్చ దుస్తులలో, పోనీటైల్ వేసుకుని అద్భుతంగా కన్పించింది. "పొడవైన అమ్మాయి సమస్యల" అంటూ ఆ పిక్స్ ను షేర్ చేసింది ఊర్వశి. ఆ లుక్ లో ఆమెను చూసిన అభిమానులు 'బార్బీ డాల్' అంటూ అభిమానాన్ని కురిపిస్తున్నారు. ఇటీవల ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో 39 మిలియన్ల ఫాలోవర్లను దాటడం విశేషం.

ఊర్వశి సినిమాల విషయానికొస్తే... భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రంతో తమిళంలో అడుగుపెట్టనుంది. దీనిలో ఆమె మైక్రోబయాలజిస్ట్, ఐఐటియన్ పాత్రలో నటించనుంది. తరువాత ఆమె నటించిన ద్విభాషా థ్రిల్లర్‌లో కనిపించబోతోంది. "బ్లాక్ రోజ్"తో పాటు 'తిరుటు పాయలే 2' హిందీ రీమేక్. ఈ నటి ఇటీవల గురు రంద్వా  సరసన 'డూబ్ గయే', మొహమ్మద్ రంజాన్ సరసన 'వెర్సేస్ బేబీ' పాటలో ఆమె కన్పించింది. ఈ రెండు సాంగ్స్ కు కూడా బ్లాక్ బస్టర్ స్పందన వచ్చింది. సూపర్ కాప్ అవినాష్ మిశ్రా, పూనమ్ మిశ్రా నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ 'ఇన్స్పెక్టర్ అవినాష్'లో రణదీప్ హుడా సరసన ఊర్వశి కన్పించింది. ఈ వెబ్ సిరీస్ ను జియో స్టూడియో నిర్మిస్తోంది. ఈ హీరోయిన్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న "బ్లాక్ రోజ్" గురించి ఇక్కడి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.


 


మరింత సమాచారం తెలుసుకోండి: