ప్రముఖ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని సోమవారం తన వార్షిక క్యాలెండర్ షూట్ నుండి అత్యంత ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్న ఫోటోను ఆవిష్కరించారు. ఈ ఫోటోగ్రాఫర్ బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని పంచుకున్నాడు. ఈ క్యాలెండర్ షూట్ కోసం బాద్షా చొక్కా లేకుండా, తన భారీ కండలను చూపిస్తూ ఫోజులిచ్చాడు. రత్నాని తన ఇన్‌స్టాగ్రామ్ లో "మీరు ఒకసారి నిర్భయంగా ఉంటే జీవితం అపరిమితంగా మారుతుంది. #డబ్బూ రత్నాని క్యాలెండర్ కోసం ఇన్విన్సిబుల్, కరిష్మాటిక్ షారూఖ్ ఖాన్" అనే క్యాప్షన్‌తో పాటు ఫోటోను షేర్ చేశారు. ఫోటో షారూఖ్ టాప్ యాంగిల్ క్లోజ్ అప్ షాట్, ఫోటోలో అతని భుజాలు, ముఖం మాత్రమే కనిపించేలా, షర్టు లేకుండా అతనిని చిత్రీకరించాడు. షూట్ కోసం సూపర్‌స్టార్ తీవ్రమైన స్మోల్డరింగ్ ఎక్స్‌ప్రెషన్‌ తో నేరుగా కెమెరాలోకి చూశాడు. ఈ పిక్ కు షారుఖ్ అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. మొత్తానికి షారుఖ్ ఈజ్ బ్యాక్ అంటున్నారు.

అయితే కొంతమంది మాత్రం ఈ ఫోటోషూట్ పై పెదవి విరుస్తున్నారు. అందులో షారుఖ్ ఫొటోకు గ్రాఫిక్స్ యాడ్ చేసినట్లుగా ఉందని విమర్శిస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. షారుఖ్ సాధారణంగా కనిపించే దానికన్నా భిన్నంగా ఈ ఫోటోషూట్ లో కనిపిస్తున్నాడు. ఆ భారీ కండలు చూస్తుంటే అది కూడా నిజమేనని అన్పిస్తోంది. ఇక మరికొంతమంది అయితే షారుఖ్ ఈ పిక్ కోసం ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ చూసి "ఎవరైనా అంబులెన్స్ పిలవండి" అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. సాధారణంగా డబ్బూ రత్నాన్ని ఫోటోషూట్ లకు మంచి క్రేజ్ ఉంది. ఎందుకంటే దాదాపు స్టార్స్ అంతా ఈ ఫోటోషూట్ కోసం బోల్డ్ గా దర్శనం ఇస్తారు. అయితే ఇలా ట్రోలింగ్ జరగడం మాత్రం సాధారణం కాదు. ఇక షారుఖ్ ఖాన్ వరుస ఫ్లాపుల అనంతరం చాలా రోజులుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. త్వరలోనే ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్ హీరోగా, నయనతార హీరోయిన్ గా సినిమా రూపొందనున్నట్టు వార్తలు వస్తున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: