చిత్ర పరిశ్రమలో కెజిఎఫ్ సినిమా ఎంతటి రికార్డు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్, శ్రీనిధి శెట్టి హీరో, హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించగా రవి బస్రూర్ సంగీతం అందించాడు. ఈ సినిమా విడుదలై అన్ని భాషల్లో కూడా భారీ సక్సెస్ కొట్టి నిర్మాతలకు, బయ్యర్లకు కాసులు కురిపించిన ఈ సినిమాకి ప్రస్తుతం కొనసాగింపుగా కెజిఎఫ్ చాప్టర్ 2 తెరక్కుతున్న సంగతి అందరికి తెలిసిన విదితమే.

ఇక ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి కొన్నాళ్లక్రితం విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ యూట్యూబ్ లో సంచలనం సృష్టించి 200 మిలియన్స్ కి పైగా వ్యూస్ అందుకుంది. అయితే ఈ సినిమాలో ప్రముఖ నటులు రావు రమేష్, ప్రకాష్ రాజ్, ఈశ్వరి రావు కీలక పాత్రలు నటిస్తున్నారు. అంతేకాక.. ఈ సినిమాని ఫస్ట్ చాప్టర్ కంటే కూడా మరింత భారీ వ్యయంతో, హై టెక్నీకల్ వాల్యూస్ తో మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో యాక్షన్ సీన్స్ కి థియేటర్స్ లో ఆడియన్స్ కి గూస్ బంప్స్ ఖాయం అని టాక్ వినిపిస్తుంది. కాగా.. ఈ సినిమాకి సంబంధించి సౌత్ భాషల శాటిలైట్ హక్కులని ప్రముఖ సంస్థ జీ వారు దక్కించుకున్నట్లు కెజిఎఫ్ నిర్మాతలు కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ప్రకటించారు.

అయితే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, అధీర రోల్ చేస్తున్న ఈ సినిమాలో ప్రధాని రమిక సేన్ పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతుండగా దీనిని డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తుంది. కాగా.. మరి ఫస్ట్ చాప్టర్ సూపర్ సక్సెస్ తో అందరిలో ఎంతో భారీ క్రేజ్ దక్కించుకున్న కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీ రేపు రిలీజ్ తరువాత ఎంతమేర సక్సెస్ అవుతుందో తెలియాలి అంటే మరొక మూడు నెలలు వెయిట్ చేయాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: