సాధారణంగా దర్శకులు ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు అంటే, అది కేవలం వినోదం కోసం మాత్రమే కాదు..ఏదో ఒక సందేశాన్ని ప్రేక్షకులకు చేరవేస్తూ ఉంటారు. ఎవరికైనా ఏదైనా చెప్పాలని ఉన్నప్పుడు, వారి మాటలు కేవలం కొన్ని ప్రదేశాలకు మాత్రమే పరిమితమవుతాయి..కానీ సినిమాల ద్వారా అయితే వారి మాటలు అందరికీ చేరుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇలా తమ లో ఉన్న సందేశాలను దర్శకులు సినిమాల రూపంలో చూపిస్తుంటారు..

ఇటీవల కాలంలో ఏదైనా ఒక సినిమాలో ఒక పాయింట్ దొరికినప్పుడు, అదే సినిమా మంచి హిట్ అయితే .. ఇక చాలా మంది దర్శకులు కూడా కొంత గ్యాప్ ఇచ్చి అదే కామన్ పాయింట్ ను తమ  సినిమా లో పెట్టడం జరుగుతుంది.అయితే కొంచెం  క్రియేటివిటీని యాడ్ చేసి, అద్భుతంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు దర్శకులు.. ఇకపోతే ఇటీవల కాలంలో వచ్చిన చాలా సినిమాలు కులవివక్షత తోనే వచ్చాయని చెప్పవచ్చు. ఏకంగా 12 సినిమాలు కేవలం కులవివక్షత అనే పాయింట్ తోనే రావడం జరిగింది. కులం , మతం అనే రెండు పదాలతో ప్రేమించుకున్న వ్యక్తులను దూరం చేయడం అనే కాన్సెప్ట్ ఈ సినిమాలను కొంతవరకు హైలెట్ చేసిందని చెప్పవచ్చు.


1940లో ఒక గ్రామం, బొంబాయి, కేరాఫ్ కంచరపాలెం, శంకరాభరణం, ప్రేమిస్తే, కలర్ ఫోటో, కంచె, రంగస్థలం, సప్తపది, శ్రీదేవి సోడా సెంటర్, ఉప్పెన, దొరసాని వంటి చిత్రాలు అన్నీ కూడా ఒకే కామన్ పాయింట్ తో తెరకెక్కడం గమనార్హం. ఈ సినిమాలలో కొన్ని జాతీయ స్థాయి అవార్డులను అందుకుంటే , మరికొన్ని యావరేజ్ గా మిగిలాయి. శంకరాభరణం సినిమాకు అయితే  జాతీయస్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా కొన్ని  అవార్డులు కూడా దక్కాయి. ఇక అంతే కాదు ఇటీవల వచ్చిన కలర్ ఫోటో, శ్రీదేవి సోడా సెంటర్ , ఉప్పెన లాంటి సినిమాలు కూడా ఈ మధ్యకాలంలో లో బాక్స్ ఆఫీసు వద్ద మంచి షేర్ రాబట్టాయి అని చెప్పవచ్చు. ఇక దీన్ని బట్టి చూస్తే ఏం అర్థం అవుతుంది అంటే..పాయింట్ ఏదైనా సరే క్రియేటివిటీ బాగుండాలి అని.


మరింత సమాచారం తెలుసుకోండి: